KV Anudeep: డైరెక్టర్ అనుదీప్ ఎందుకు చెప్పులు వేసుకోడో తెల్సా..? దీని వెనుక పెద్ద రీజనే ఉంది
డైరెక్టర్ అనుదీప్ ఎందుకు చెప్పులు కానీ, షూ కానీ వేసుకోడు..? దీని వెనుక చాలా ఆసక్తికర కారణమే ఉంది.
అనుదీప్ కేవీ.. పిట్టగోడ సినిమా తీసి పెద్దగా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ.. జాతిరత్నాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల ప్రిన్స్ మూవీతోనూ అలరించాడు. తన ప్రవర్తనతో అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. క్యాష్ ప్రొగ్రామ్ అనుదీప్‌ను స్టార్‌ను చేసింది. అతను మీమర్స్‌కు ఆల్‌టైమ్ మెటీరియల్ అయిపోయాడు. ప్రతి ఇంటర్య్వూలోనూ వారికి కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. అతడు వేసే పంచ్‌లకు పడి పడి నవ్వాల్సిందే. అతడు ఏం చదువకున్నాడు, క్వాలిఫికేషన్ ఏంటన్నది మిలియన్ డాలర్ ప్రశ్న అయిపోయింది. ఎప్పుడు ఈ ప్రశ్న అడిగినా తనకు తోచింది, నోటికి వచ్చింది చెబుతుంటాడు. ఇలా చిత్ర విచిత్ర ధోరణితో తనకంటూ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను సెట్ చేసుకున్నాడు.
కాగా అతడు ఎప్పుడూ చెప్పులు వేసుకోడు. అలా వేసుకుని కనిపించలేదు కదా. దీని గురించి ఎప్పుడు అడిగినా మాట దాటేస్తుంటాడు. దీనిపై అతని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం సేకరించగా.. ఇంట్రస్టింగ్ ఆన్సర్ వచ్చింది. “క్లింట్ ఒబెర్” రాసిన “ఎర్తింగ్” పుస్తకం చదివి, సింథటిక్ వచ్చిన తరువాత భూమికి, మనిషికి ఉన్న కనెక్టవిటి మిస్ అవుతుందని తెలుసుకుని చెప్పులు వేసుకోవడం మానేశాడట. ఇతను కామెడీగా మాట్లాడతాడు కానీ కొన్ని విషయాలపై చాలా పట్టు ఉందని ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ చేసిన ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమైంది.
కాగా తనకు హైలీ సెన్సీటీవ్ పర్సన్ డిజార్డర్ ఉందని కూడా ఇటీవల వెల్లడించాడు అనుదీప్. దీని కారణంగా కాఫీ తాగితే తనకు 2 రోజులు నిద్రపట్టదని.. ఏదైనా పళ్ల రసం తాగితే మెదడు పనితీరు స్ట్రక్ అవుతుందని తెలిపాడు. ఈ డిసీజ్ ఉన్నవారు త్వరగా అలసిపోతాడని వివరించాడు. ఎక్కువ ఫోకస్ ఉన్న లైట్స్ చూసినా, ఘాటైన వాసన పీల్చినా ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. త్వరలో ఈ డిజార్డర్‌పై ఓ సినిమా తీసే ఉద్దేశం ఉందని కూడా వెల్లడించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..