Mahesh Babu: మహేష్ అన్న రమేష్ బాబు కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే..!!
రమేష్ బాబు హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా రమేష్ బాబు 17 సినిమాల్లో నటించారు. కృష్ణ తో కలిసి నటించిన ఎంకౌంటర్ సినిమానే నటుడిగా ఆయన చివరి సినిమా.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా హీరోగా పరిచయం అయ్యారు. రమేష్ బాబు హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా రమేష్ బాబు 17 సినిమాల్లో నటించారు. కృష్ణ తో కలిసి నటించిన ఎంకౌంటర్ సినిమానే నటుడిగా ఆయన చివరి సినిమా. ఆ తర్వాత నిర్మాతగా మారారు రమేష్ బాబు. నిర్మాతగా నాలుగు సినిమాలు చేశారు. హిందీలో సూర్య వంశం సినిమా నిర్మించారు. ఆ తర్వాత మహేష్ నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. రమేష్ బాబుకు ఒక కూతురు, కొడుకు. ఇదిలా ఉంటే ఇటీవలే రమేష్ బాబు అనారోగ్య కారణంగా కన్ను మూసిన విషయం తెలిసిందే. మహేష్ బాబుకు అన్న అంటే ప్రాణం. చాలా సందర్భాల్లో ఆ విషయాన్నీ తెలిపారు మహేష్. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన అన్న చివరి చూపుకు నోచుకోలేదు.
ఆ తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరాదేవిని, తండ్రి కృష్ణను కోల్పోయారు. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఇటీవలే కృష్ణ దశదిన కర్మ జరిపారు కుటుంబసభ్యులు. ఈ కార్యక్రమానికి రమేష్ బాబు కూతురు కొడుకు హాజరయ్యారు. రమేష్ బాబు కూతురిని, కొడుకుని చూసి అందరు షాక్ అయ్యారు. రమేష్ బాబు కూతురు భారతి, కొడుకు జయ కృష్ణ. వీరిద్దరూ చాలా బాగున్నారు. జయ కృష్ణ హీరో మెటీరియల్ గా ఉన్నాడు. అలాగే కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది. ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అచ్చం హీరోయిన్ లా ఉంది భారతి. ఇప్పుడు భారతకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





Bharathi