Odela 2 Movie: ‘ఓదెల 2’ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా? నాని, బాలయ్యలతో సినిమాలు తీసిందండోయ్
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓదెల 2. గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు ఇది సీక్వెల్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తమన్నా కీలక పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ఓదెల 2. గతంలో రచ్చ, బెంగాల్ టైగర్ వంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించడం విశేషం. గత శుక్రవారం (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ మూవీలో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, హెబ్బాపటేల్, వశిష్ఠ ఎన్.సింహా, మురళీ శర్మ, శరత్ లోహితాశ్వ, యువ, నాగ మహేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే కనిపించిన తమన్నా మొదటిసారిగా ఇందులో నాగ సాధువుగా నటించి మెప్పించింది. ఇందులో మిల్కీ బ్యూటీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో తమన్నా తర్వాత హైలెట్ గా నిలిచిన మరో పాత్ర విలన్‌ది. కొత్తగా పెళ్లైన అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపే ఈ ప్రేతాత్మ పాత్రలో ప్రముఖ టాలీవుడ్ నటుడు వశిష్ట ఎన్. సింహా అదరగొట్టాడు. ముఖ్యంగా తన గంభీరమైన గొంతుతో ఆడియెన్స్ ను భయ పెట్టాడు. మొత్తానికి విలన్ గా మరో సూపర్ హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు వశిష్ట.
వశిష్ట పేరుకు కన్నడ నటుడే అయినా తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కేజీఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా తదితర తెలుగు సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు.
భార్య హరిప్రియతో వశిష్ట..
View this post on Instagram
అన్నట్లు వశిష్ట సతీమణి కూడా ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయినే. న్యాచురల్ స్టార్ నాని, బాలకృష్ట తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసిందామె. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ కన్నడ సినిమాల్లో మెరుస్తూనే ఉంది. ఆమె హరిప్రియ. పేరు చెబితే చాలామంది గుర్తు పట్టలేరు కానీ.. నాని పిల్ల జమీందార్ హీరోయిన్ అంటే ఇట్టే కళ్ల ముందు మెదులుతుంది. తకిత తకిట సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హరి ప్రియ. నానితో కలిసి పిల్ల జమీందార్ సినిమాలె పక్కింటమ్మాయిగా నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలోనూ యాక్ట్ చేసింది
ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్..
View this post on Instagram
హరిప్రియ, వశిష్ట సింహలది ప్రేమ వివాహం. ఇరు పెద్దల సమక్షంలో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







