
సినిమా ఇండస్ట్రీలో కథలు మారడమనేది కామన్. అలాగే ఓ హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడమన్నది కూడా సహజమే. కొన్ని సార్లు అలా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు ఫ్లాఫ్ అవుతుంటాయి. సినిమా కథలను ఎంచుకునే విషయంలో ఒక్కొక్క హీరోకు ఒక్కో అంచనా ఉంటుంది. కొన్ని సార్లు ఆ అంచనాలు కరెక్ట్ అవ్వొచ్చు… మరికొన్ని సార్లు జడ్జిమెంట్ రాంగ్ కావొచ్చు. స్టార్ హీరోలు మహేష్ బాబు, నాగార్జునల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. రాజ కుమారుడు సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు మహేష్. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
ఇదే క్రమంలో ఓ స్టార్ డైరెక్టర్ కూడా మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. మహేష్ కు కూడా కథ నచ్చడంతో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. అయితే అప్పటికే మహేష్ యువరాజు సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో ఈ మూవీ తర్వాతన మహేష్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకున్నారు. అయితే తీరా యువరాజు సినిమా రిలీజయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ సినిమా హిట్ అయినా మహేష్ ను తండ్రిగా చూడలేకపోయారు ఫ్యాన్స్. ఇక తర్వాతి సినిమా కూడా దాదాపు ఇదే టెంప్లేట్ కావడంతో మహేష్ ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టారు. దీంతో డైరెక్టర్ నాగార్జును హీరోగా ఎంచుకున్నారు. మహేష్ మూవీ కోసం ఎంపిక చేసుకున్న ప్రొడ్యూసర్, టెక్నీషియన్లతోనే సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇలా ఈ సినిమా విషయంలో మహేష్ బాబు జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా నాగార్జున అంచనాలు మాత్రం గురి తప్పాయి. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? బావ నచ్చాడు.
అవును.. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన బావ నచ్చాడు సినిమా కథ మొదట మహేష్ కే చెప్పారట. అయితే మహేష్ ఎందుకనో ఈ మూవీ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో నాగ్ తెరపైకి వచ్చాడు. ఈ మూవీలో నాగార్జునకు జోడీగా సిమ్రాన్, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో రిలీజైన ‘బావ నచ్చాడు’ ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించలేకపోయిది. దీంతో నాగ్ ఖాతాలో ఒక ఫ్లాప్ చేరిపోయింది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు మహేష్ బాబు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు హిందీ, దక్షిణాది నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.