AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోయిన్.. రియల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు.. చివరకు చిన్నవయసులోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది

ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది. సినిమాల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది.. రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరకు ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోయిన్.. రియల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు.. చివరకు చిన్నవయసులోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 26, 2025 | 1:04 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు, తల్లి వదిన తరహా పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఓ ముద్దుగుమ్మ మాత్రం పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నా.. ఆఫర్స్ రాక డీలాపడిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నా ఆ తర్వాత ఆమె నిజ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగాయి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలతో నటించిన ఆమె .. అందరిని దుఃఖ సాగరంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

తెలుగులో ఎంతోమంది హీరోయిన్స్ తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్నారు అలాంటి వారిలో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఆర్తి సినీ జీవితం మొదట బాలీవుడ్‌లో ప్రారంభమైంది. 16 ఏళ్ల వయసులో “పాగల్‌పాన్” అనే హిందీ చిత్రంతో ఆమె తొలి అడుగు వేసింది. అయితే, ఆమెకు అసలు గుర్తింపు తెలుగు సినిమా “నువ్వు నాకు నచ్చావ్”  ద్వారా వచ్చింది, ఇందులో ఆమె వెంకటేష్ సరసన నటించింది ఈ బ్యూటీ.. ఈ చిత్రం ఘన విజయం సాధించి ఆర్తిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత ఆమె చిరంజీవితో “ఇంద్ర”, మహేష్ బాబుతో “బాబీ”, బాలకృష్ణతో “పల్నాటి బ్రహ్మనాయుడు”, నాగార్జునతో “నేనున్నాను”, ప్రభాస్‌తో “అడవి రాముడు”, జూనియర్ ఎన్టీఆర్‌తో “నరసింహుడు” వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

ఆర్తి అగర్వాల్ తెలుగు మాట్లాడలేకపోయినప్పటికీ, తన అందం, నటనతో స్టార్ హీరోల సరసన విజయవంతంగా నటించింది. కాగా 2005లో ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంది. అప్పటి స్టార్ హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ వచ్చిన వదంతులతో విసిగి, ఆమె క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 2007లో ఆమె న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది, కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. వివాహం తర్వాత ఆమె అమెరికాలో కొంతకాలం గడిపి, మళ్లీ తెలుగు సినిమాల్లో నటించడానికి తిరిగి వచ్చింది. 2015లో ఆమె లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది, కానీ ఆరు వారాల తర్వాత శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. జూన్ 6, 2015న, 31 ఏళ్ల వయసులో ఆర్తి అగర్వాల్ కన్నుమూసింది. ఆర్తి అగర్వాల్ తక్కువ సమయంలోనే తనకంటూ చెరగని ముద్ర వేసింది. ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ కూడా “గంగోత్రి” చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ ఆమె ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.