Tollywood: ద్యావుడా.. ఈమె.. ఆమేనా.! కూలీ మూవీలోని ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'. ఈ మూవీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇందులో ఓ కీలక పాత్రలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆ వివరాలు..

సినీ ఇండస్ట్రీలో ఓ స్టార్‌గా గుర్తింపు పొందాలంటే.. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు.. డీ-గ్లామర్ రోల్స్, ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. సొంత భాషలో చేసినవి ఐదు సినిమాలైతే.. తెలుగులో చేసినవి మూడు.. తమిళంలో ఐదు చిత్రాలు చేసింది. తెలుగులో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 2016లో నివిన్ పాలీ హీరోగా ‘జాకబిన్‌టి స్వర్గరాజ్యం’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది ఈ చిన్నది. ఇక ఆమె మరెవరో కాదు రెబా మోనికా జాన్.
తొలి సినిమాతో మలయాళంలో పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది ఈ భామ. అయితే ఆ తర్వాత మూడేళ్లకు తమిళంలో దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2020లో మలయాళంలో ‘ఫోరెన్సిక్’ మూవీతో హిట్ కొట్టింది. ఆ వెంటనే 2021లో ‘రత్నాన్ ప్రపంచ’ సినిమాతో కన్నడంలోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘బూ’, ‘సామజవరగమన’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘సింగల్’ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘కూలీ’, దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే కన్నడంలో ‘సకలకళా వల్లభ’ చిత్రం చేస్తోంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే రెబా మోనికా జాన్.. ఎప్పుడూ లేటెస్ట్ అప్‌డేట్స్, క్రేజీ ఫోటోలతో ఫ్యాన్స్‌లో టచ్‌లో ఉంటోంది.
View this post on Instagram
ఇది చదవండి: అప్పుడు రూ.500తో ఇండస్ట్రీకి.. ఇప్పుడు రూ. 35 కోట్లతో క్రేజీ హీరోగా.. ఈ యాక్టర్ ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




