Tollywood: జీవితాన్ని మార్చేసిన ప్రమాదం.. సినిమాలు వదిలి వ్యాపారంలో కోట్లకు అధిపతి అయిన స్టార్ హీరో.. కానీ ఇప్పుడు..
ముఖ్యంగా 90'sలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన స్టార్ హీరోస్ గురించి చెప్పక్కర్లేదు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమై చాలాకాలం పాటు అజ్ఞాతనంలో గడిపి.. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రిన్ పై రాణిస్తున్నారు. అందులో అలనాటి అందాల హీరో

వెండితెరపై హీరోలుగా వెలిగి ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన హీరోస్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా 90’sలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన స్టార్ హీరోస్ గురించి చెప్పక్కర్లేదు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమై చాలాకాలం పాటు అజ్ఞాతనంలో గడిపి.. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రిన్ పై రాణిస్తున్నారు. అందులో అలనాటి అందాల హీరో అరవింద్ స్వామి ఒకరు. రోజా, బొంబాయి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు. 20 ఏళ్ల వయసులోనే సినీ ప్రయాణం ఆరంభించి.. కెరీర్ ప్రారంభంలోనే అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరో.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అనుహ్యంగా నటనకు వీడ్కొలు పలికి వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఓ ప్రమాదం ఆయన జీవితాన్ని మార్చేసింది.
1991లో మణిరత్నం తెరకెక్కించిన దళపతి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు అరవింద్ స్వామి. అప్పుడు ఆయన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే.ఈ సినిమా తర్వాత 1992లో రోజా సినిమాతో హీరోగా మారాడు. అప్పట్లో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత 1995లో ఆయన నటించిన బొంబాయి చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అరవింద్ స్వామికి స్టార్ డమ్ అందించింది. అప్పటినుంచి అరవింద్ స్వామి నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్న అరవింద్ స్వామి కెరీర్ లో పలు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో మెల్లిగా అతనికి హీరోగా అవకశాలు తగ్గి సహాయ పాత్రలు రావడం ప్రారంభమయ్యాయి.




View this post on Instagram
కొన్నాళ్లకు అరవింద్ స్వామి నటించాల్సిన రెండు చిత్రాలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. దీంతో అతను ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నారు. అదే సమయంలో అంటే 2005లో అరవింద్ స్వామికి ఓ పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన కాలు పక్షవాతానికి గురైంది. అందుకు ఆయనకు సుమారు 4 నుంచి 5 సంవత్సరాలు చికిత్స జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఆయన తండ్రికి వ్యాపారంలో సహయం చేశారు. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వ్యాపారంలో రాణించారు. 2022లో ఆయన వ్యాపారం రూ.3,300 కోట్లకు చేరింది.
View this post on Instagram
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వామి.. 2013లో విడుదలైన కడలి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించారు. ఇటీవల నాగచైతన్య నటించి కస్టడీ చిత్రంలోనూ అరవింద్ స్వామి నటించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
