Samantha : అక్కడ టాటూను తొలగించిన సమంత.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..
టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన సామ్.. అందం, అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సామ్.. అదే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది.

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిర్మాతగానూ సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకుంది సామ్.. ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇటీవలే శుభం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది. సిటాడెల్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామ్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఈ సిరీస్ తో హిందీ ఆడియన్స్ కు దగ్గరయిన సామ్ ఇప్పుడు. సిటాడెల్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలోఅదరగొడుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్‌లో ఉంది ఈ సిరీస్.
త్వరలోనే సమంత హీరోయిన్ గా ను బిజీ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబందించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సమంత మెడ పై టాటూ కనిపించకపోవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సమంత టాటూ కనిపించకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత టాటూ తొలగించిందని కొంతమంది. లేదు మేకప్ తో కవర్ చేసిందని మరికొంతమంది అంటున్నారు.
సమంత మెడపై వైఎమ్‌సి అనే టాటూ ఉంటుంది. తన మొదటి సినిమా ఏమాయ చేసావె గుర్తుగా ఆ టాటూ వేయించుకుంది సమంత. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. అయితే ఈ వైఎమ్‌సి టాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది సమంత. ఇప్పుడు టాటూ కనిపించక పోవడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ కు రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలోనూ నటిస్తున్నారు సామ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.