- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes like allu arjun ram charan mahesh babu doing movie one after another
ఒకే దారిలో వెళ్తున్న టాలీవుడ్ హీరోలు.. అన్ని పడవల మీద కాలు వేస్తే బోల్తానే అంటున్న స్టార్స్
అటూ ఇటూ అని హెక్టిక్‌గా తిరగడం ఎందుకు? ఒకటి పూర్తయిన తర్వాతే మరో ప్రాజెక్టు మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తే సరిపోతుంది కదా.. అలా చేస్తే కేరక్టర్ మీదా గ్రిప్ వస్తుంది, యూనిక్ లుక్‌ని మెయింటెయిన్ చేయొచ్చు.. స్పీడు పెంచొచ్చు.. అనే కాన్సెప్టుతో వెళ్తున్నారు కొందరు హీరోలు.. ఇంతకీ ఎవరు వారు... ఈ ఏడాది డాకు మహారాజ్‌తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత అఖండ2
Updated on: Jun 07, 2025 | 2:15 PM

ఈ ఏడాది డాకు మహారాజ్‌తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత అఖండ2 సెట్స్ లో అడుగుపెట్టారు. ఎట్ ఎ టైమ్ ఒన్ మూవీ అనే ఫార్ములాని ఫాలో అవుతున్నారు బాలయ్య.

నందమూరి అందగాడి రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు మెగా వారసుడు రామ్‌చరణ్. పెద్దికి సంబంధించి ప్రస్తుతం నైట్ షూట్స్ జరుగుతున్నాయి. మళ్లీ మళ్లీ పుడతామా ఏటి.. అంటూ గ్లింప్స్ తో ఆకట్టుకున్న రామ్‌చరణ్, మరింత ఫోకస్‌గా చేస్తున్నారు పెద్ది మూవీని. ఈ సినిమా పూర్తయ్యాక, లుక్ చెక్ చేసుకుని నెక్స్ట్ సినిమా సెట్లో అడుగుపెట్టాలని ఫిక్సయిపోయారు.

అల్లు అర్జున్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఇదే ఆలోచనతో ఉన్నారు. పుష్పతో ఊరమాస్‌గా కనిపించిన అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్‌గా మారిపోయారు అట్లీ కోసం. మా హీరోని ఇలా చూసి ఎన్నాళ్లయిందని సంబరపడుతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు.

ఇంటర్నేషనల్ లెవల్లో చేసే సినిమా కదా.. మా స్టార్ కూడా ఒక ప్రాజెక్ట్ కి ఫిక్స్ కావడం మాకేం ఇబ్బంది లేదని అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎన్నేళ్లు కేటాయిస్తారోననే టెన్షన్ ఓ వైపు వెంటాడినా, మంచి సినిమా కోసమే కదా అని వారిలో వారు సర్దిచెప్పుకుంటున్నారు.

సూపర్‌స్టార్‌నే ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. హిట్ 3 విజయోత్సాహంలోనే ప్యారడైజ్‌ని పూర్తి చేసేయాలని ఫిక్సయ్యారు. ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలనుకుంటున్నారు.




