Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్ లక్ అంటే నీదే బాసూ.. ఏకంగా పది బ్లాక్ బస్టర్ హిట్స్ వదులుకున్న యంగ్ హీరో..

చాలా మంది హీరోలు కొన్ని బ్లాక్ బస్టర్స్ ను వదులుకుంటూ ఉంటారు. ఒకటి రెండు సినిమాలు వదులుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ ఈ హీరో ఏకంగా 10 బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలు చేసి ఉంటే ఆయన ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడు. ఇంతకూ ఆ హీరో ఎవరు.?

బ్యాడ్ లక్ అంటే నీదే బాసూ.. ఏకంగా పది బ్లాక్ బస్టర్ హిట్స్ వదులుకున్న యంగ్ హీరో..
Tollywood Hero
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2025 | 8:28 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకుంటూ ఉంటారు. కథ నచ్చకపోవడమో, లేక సినిమా డేట్స్ అడ్జెస్ట్ అవ్వకో సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అయితే ఒకటి రెండు సినిమాలు వదులుకున్న హీరోలు ఉన్నారు. కానీ ఈ హీరో మాత్రం ఏకంగా పది సినిమాలను వదులుకున్నాడు. ఆ హీరో వదులుకున్న పది సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో బ్యాడ్ లక్ అంటే ఈ హీరోదే అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆ సినిమాలు చేసి ఉంటే ఆ హీరో ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరు. ? ఆయన వదులుకున్న పది సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరో ఎవరు అంటే టాక్కున చెప్పే పేరు నేచురల్ స్టార్ నాని. నాని సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. కథ ఎలా ఉన్నప్పటికీ నాని తన  నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. సహజమైన నటనతో నేచురల్ స్టార్ అనే బిరుదు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా దసరా, హాయ్ నాన్న, స‌రిపోదా శ‌నివారం సినిమాతో మంచి విజయాలను అందుకున్నాడు.

నాని సినిమాలు ప్రేక్షకులను వ్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నాని. ఇదిలా ఉంటే నాని దాదాపు 10 బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడని తెలుస్తుంది. నాని వదులుకున్న పది సినిమాలు ఇవే.. ఉయ్యాల జంపాల, సుప్రీమ్, ఊపిరి, మహానటి (ఏఎన్ఆర్ పాత్ర ), సుకుమారుడు, తడాకా, గుండెజారి గల్లంతయ్యిందే, జాను, శ్రీకారం,రాజా రాణి ఇలా ఇంకొన్ని సినిమాలను కూడా నాని మిస్ చేసుకున్నాడు. వీటిలో దాదాపు పది సినిమాల వరకు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాలు నాని చేసి ఉంటే ఇప్పుడు ఆయన రేంజ్ నెక్స్ట్ లెవల్ లోఉండేవాడని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.