నన్ను సూపర్ స్టార్ అని పిలిస్తే చాలా హ్యాపీగా ఉంది.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రేక్షకులు తనని సూపర్‌స్టార్ అని పిలుస్తుంటే హ్యాపీగా ఉందన్నారు రష్మిక మందన్న. అయితే సూపర్ స్టార్ స్టేటస్ తన లక్ష్యం కాదన్నారు. అంత పెద్ద స్టేటస్ వచ్చేసిన తర్వాత, అది మన లక్ష్యం కాదంటున్నారా? లేకుంటే, అంతకు మించిన గోల్ ఉందా? నేషనల్ క్రష్‌కి. కమాన్ లెట్స్ వాచ్...
Updated on: Jan 31, 2025 | 7:46 AM

ఆడియన్స్ ఫేస్‌లో ఎప్పుడూ నవ్వులు చూడాలి. అదొక్కటే నా లక్ష్యం. ఎప్పటికప్పుడు వారి టేస్ట్ ని గమనిస్తూ, సినిమాలు చేస్తూ, ఎంటర్‌టైన్ చేయాలి. అందుకు తగ్గ మంచి కేరక్టర్లు సెలక్ట్ చేసుకోవాలి.. ఇదొక్కటే నా ముందున్న గోల్ అని అంటున్నారు రష్మిక మందన్న.

చిన్నప్పటి నుంచీ ఎక్కువగా హాస్టల్స్ లో పెరగడం వల్ల, తనకు మిగిలిన వారిని కలుపుకుని పోవడం ఈజీగా వచ్చేసిందన్నారు ఈ బ్యూటీ. హాస్టల్స్ లో రోజుకు అరగంట కూడా టీవీ చూడనిచ్చేవారు కాదని, అయితే అరుదుగా తండ్రితో కలిసి సినిమాలు చూసేదాన్ననీ చెప్పారు. అలాంటిది ఇవాళ సినిమా ఫీల్డ్ లో తను మంచి పొజిషన్‌లో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు మిస్ నేషనల్ క్రష్.

తాను సెలక్ట్ చేసుకున్న ప్రతి కేరక్టరూ నటిగా తనను మెరుగుపరిచిందన్నది రష్మిక ఇస్తున్న స్టేట్‌మెంట్. ఒకే సమయంలో భిన్నమైన పాత్రలో చేయడం వల్ల, అందులోని భావోద్వేగాలను మేనేజ్ చేయడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. సెట్లో ఉన్నవారు సహకరించడం వల్లనే తాను ఆయా పాత్రలో మెప్పించగలుగుతున్నానని, సక్సెస్‌ని అందరితో షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ.

ఓ వ్యక్తి సక్సెస్ రూట్లో ఉన్నారంటే, తప్పకుండా ఎక్కడో ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదన్నారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి.

తాను ప్రస్తుతం తన ఫ్యామిలీకి తగినంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. తన ఫ్యామిలీ కూడా తన బిజీని అర్థం చేసుకుంటోందని అన్నారు.