మరోసారి సౌత్ హీరోతో జోడీ కట్టనున్న కృతి సనన్.. ఇప్పుడైనా హిట్ అందుకుంటుందా?
మీరందరూ ఇప్పుడు వెళ్తున్నారు. నేనెప్పుడో వెళ్లొచ్చాను. వెళ్లొచ్చాను అనడం కన్నా.. వెళ్తూ వస్తూ ఉన్నాను అని అనడం బెటర్ అంటూ ఓన్ వెర్షన్‌ని కాస్త స్ట్రాంగ్‌గానే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇంతకీ ఆమె వెళ్లింది ఎక్కడికి? వచ్చింది ఎక్కడి నుంచీ... చూద్దాం పదండి...
Updated on: Jan 31, 2025 | 7:36 AM

కృతిసనన్ మనకి కొత్తేం కాదు. అప్పుడెప్పుడో నాగచైతన్యతోనూ, ఆ వెంటనే మహేష్‌తోనూ నటించేశారు. ఆమె ఫస్ట్ ప్రయత్నం మన వారికి పెద్దగా నచ్చలేదు. ఆ రెండు సినిమాలు ఆమెకు, ఆమె.. ఆ సినిమాలకూ ఏ మాత్రం ప్లస్ కాలేదన్నదే నిజం..

తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన కృతి, ఈ మధ్య ఆదిపురుష్ చేశారు. డార్లింగ్‌కీ, కృతికీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ వార్తలు వచ్చింది కూడా ఈ సినిమా టైమ్‌లోనే. అయితే మేం అనుకున్న మర్యాదపురుషోత్తముడి కథ ఇది కాదంటూ సినిమాను ఆదరించలేదు ఆడియన్స్. దాంతో కృతి మరోసారి నార్త్ కే పరిమితమయ్యారు.

ఉత్తరాదిని ఓ వైపు నిర్మాతగా అడుగులు వేస్తూ, మరోవైపు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్‌ని కంటిన్యూ చేస్తున్నారు. కృతి సినిమా యాక్సెప్ట్ చేశారంటే, జస్ట్ అదేదో గ్లామర్ పర్పస్ మాత్రమే కాదనే క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్ కి. అందుకే ఆమె సినిమాల కోసం వెయిట్ చేసే స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ అయ్యారు.

లేటెస్ట్ గా మరోసారి సౌత్ హీరోతో జోడీ కట్టబోతున్నారు కృతి. లాస్ట్ ఇయర్ జాన్వీ, దీపిక, దిశా సక్సెస్ అయిన చోట.. ఈ ఏడాది తాను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఆనంద్ ఎల్ రాయ్ డైరక్షన్‌లో ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమాలో నాయికగా కృతి ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ బజ్. ఈ మూవీ టీజర్‌లో వినిపిస్తున్న వాయిస్ కృతిదేనని కన్‌ఫర్మ్ చేస్తూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.





























