ఇదెక్కడి మాస్ రా మావ..!! పెద్ది స్టైల్‌లో సిక్స్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్.. చరణ్ ఏమన్నాడంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో పేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.
ఇండ్ల ఉంటే పెద్ది టైటిల్ టీజర్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడే సీన్ చూపించారు. చరణ్ సిగ్నేచర్ షాట్ బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఇదే క్రికెట్ షాట్ రీ క్రియేట్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ పెద్ది సినిమా క్రికెట్ సీన్ ను రీ క్రియేట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నేడు SRH vs DC మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ ప్లేఆఫ్ కు చేరాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిందే.. ఇక హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడి 6 పాయింట్లతో 9స్థానంలో ఉంది. ఈ రోజు జాగరబోయే ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా ఉండనుంది. కాగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా పెద్ది సినిమాలో క్రికెట్ షాట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రి క్రియేట్ చేసింది. తాజాగా ఢిల్లీ ఒక వీడియోను విడుదల చేసింది.. ఈ వీడియోలో సమీర్ రజ్వీ రామ్ చరణ్ స్టైల్ లో సిక్స్ కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు . ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. ఈ వీడియోకు రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. థాంక్స్ చెప్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు చరణ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








