Deepika Padukone: ముంబై సిద్ధి వినాయకుడి ఆలయంలో దీపిక.. డెలివరీకి ముందు దేవుడి దీవెనలు.. వీడియో

దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యలను మండపాల్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ దంపతులు ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని దర్శించుకున్నారు.

Deepika Padukone: ముంబై సిద్ధి వినాయకుడి ఆలయంలో దీపిక.. డెలివరీకి ముందు దేవుడి దీవెనలు.. వీడియో
Deepika Padukone
Follow us
Basha Shek

|

Updated on: Sep 07, 2024 | 11:58 AM

దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యలను మండపాల్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ దంపతులు ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని దర్శించుకున్నారు. వినాయక చవితి కి ఒక రోజు ముందే ఆలయానికి వచ్చిన దంపతులు గణేశుడిని దర్శించుకున్న అనంతరం ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతుంది. కాగా మరికొన్ని రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు దీపికా, రణ్ వీర్ సింగ్. ప్రస్తుతం దీపిక నిండు గర్భంతో ఉంది. ఈ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగానే వినాయకుడి దీవెనలు అందుకున్నారీ లవ్లీ కపుల్.

కాగా 2018లో దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ వివాహంతో ఒక్కటయ్యారు.  తమ ప్రేమ, పెళ్లి బంధాలకు ప్రతీకగా ఈ ఏడాది ఫిబ్రవరిలోతాను గర్భం ధరించినట్లు ప్రకటించింది దీపిక. అంతే కాదు ఈ సెప్టెంబర్ లోనే తమ జీవితంలోకి బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అయితే మొదట ప్రసవం కోసం దీపిక లండన్‌కు వెళ్లనున్నారని   వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే ఆమె డెలివరీకి అన్ని ఏర్పాట్లు జరగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 28న దీపికా పదుకొణె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దీపిక కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి

ముంబై సిద్ధి వినాయకుడి ఆలయంలో దీపిక, రణ్ వీర్.. వీడియో

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Voompla (@voompla) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

సంప్రదాయ బద్దంగా చీరలో వినాయకుడి ఆలయానికి దీపిక.. ఫొటోస్ ఇదిగో..

 విదేశాల్లో కాదు.. సెప్టెంబర్ 28 న ముంబైలోనే పండంటి బిడ్డను ప్రసవించనున్న దీపిక పదుకొణె..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తింస్తుందో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తింస్తుందో తెలుసా?
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే