టాలీవుడ్‌లోకి మరో తెలుగందం.. రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా పరిచయంకానున్న సుమయా
టాలీవుడ్‌కు తెలుగమ్మాయిలు రావడమే కష్టం అనుకుంటున్న సమయంలో.. ఓ తెలుగుమ్మాయి హీరోయిన్‌గా రావడమే కాకుండా.. రైటర్ ప్లస్ నిర్మాతగానూ సత్తా చూపించబోతున్నారు. సొంతంగా ఓ కథ రాసుకుని.. త్వరలోనే ఓ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.
టాలీవుడ్‌కు తెలుగమ్మాయిలు రావడమే కష్టం అనుకుంటున్న సమయంలో.. ఓ తెలుగుమ్మాయి హీరోయిన్‌గా రావడమే కాకుండా.. రైటర్ ప్లస్ నిర్మాతగానూ సత్తా చూపించబోతున్నారు. సొంతంగా ఓ కథ రాసుకుని.. త్వరలోనే ఓ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఎవరా టాలెంటెడ్ తెలుగమ్మాయి..? ఆమె చేస్తున్న సినిమా ఏంటి.? ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం.!
తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు కానీ ప్రేక్షకులకు కొందరు మాత్రమే గుర్తుంటారు. ఇప్పుడు సుమయా రెడ్డి అనే అమ్మాయి ఇదే చేస్తున్నారు. ‘డియర్ ఉమ’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు సుమయా. ఈ సినిమాకు ఆమె కథ అందించడమే కాక.. హీరోయిన్‌గా నటిస్తూ నిర్మిస్తున్నారు కూడా. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.
పృధ్వీరాజ్ అంబర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిరాజేశ్ మహాదేవ్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ముచ్చింతల్‌లోని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రాలేదని.. స్వామి వారి ఆశీస్సుల కోసమే వచ్చానన్నారు సుమయా రెడ్డి. డియర్ ఉమ కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
సుమయా రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సుమయా రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.