Ram Charan: ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా.. మల్టీవర్సేస్ ప్లాన్ చేస్తున్న లోకేష్..
ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇక ఇటీవల సోషల్ మీడియాలో లీకైన రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత చరణ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రాబోతుందని టాక్ నడుస్తోంది.
ఇటీవలే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. కమల్ హాసన్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్, సూర్య కీలకపాత్రలలో నటించారు. తాజాగా చరణ్, లోకేష్ కనగరాజ్ కాంబో నుంచి రాబోయే సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీరి కాంబోలో రాబోతున్న సినిమా యూనివర్స్ మూవీస్ అనుబంధంగా తెరకెక్కనుందట. ఇందులో చరణ్ పవర్ ఫుల్ మాస్ యాంగిల్ లో కనిపించనున్నారట. ప్రస్తుతం లోకేష్ విజయ్ దళపతితో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చరణ్, లోకేష్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చరణ్ తోనూ మల్టీవర్సెస్ సినిమా చేయనున్నాడు లోకేష్.