AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Radhe Shyam: రాధేశ్యామ్‌కు క‌రోనా దెబ్బ‌.. చెప్పిన స‌మ‌యానికి రాలేక‌పోతున్న ప్ర‌భాస్‌..?

Prabhas Radhe Shyam: క‌రోనా మ‌హ‌మ్మారి సినిమా రంగంపై చూపిస్తోన్న ప్ర‌భావం అంతా ఇంత కాదు. రూ. వంద‌ల కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాలు సైతం క‌రోనా దెబ్బ‌కు థియేటర్ల‌ను నోచుకోలేక‌పోతున్నాయి...

Prabhas Radhe Shyam: రాధేశ్యామ్‌కు క‌రోనా దెబ్బ‌.. చెప్పిన స‌మ‌యానికి రాలేక‌పోతున్న ప్ర‌భాస్‌..?
Radhe Shyam Releasing Date
Narender Vaitla
|

Updated on: May 06, 2021 | 6:01 AM

Share

Prabhas Radhe Shyam: క‌రోనా మ‌హ‌మ్మారి సినిమా రంగంపై చూపిస్తోన్న ప్ర‌భావం అంతా ఇంత కాదు. రూ. వంద‌ల కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాలు సైతం క‌రోనా దెబ్బ‌కు థియేటర్ల‌ను నోచుకోలేక‌పోతున్నాయి. క‌రోనా తొలి వేవ్ త‌ర్వాత కొన్ని రోజుల‌పాటు ఓపెన్ అయిన థియేట‌ర్లు మ‌ళ్లీ మూత‌ప‌డ్డాయి. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేక‌పోతుంటే. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న చిత్రాలపై సైతం క‌రోనా ప్ర‌భావం ప‌డుతోంది. దీంతో సినిమాలు ప్ర‌క‌టించిన తేదీకి రాలేక‌పోతున్నాయి. తాజాగా ఈ ప్ర‌భావం ప్రభాస్ రాధేశ్యామ్‌పై కూడా ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. గతేడాది లాక్‌డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. నిజానికి ఈ సినిమాను జూలై 30న విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ప్ర‌క‌టించిన తేదీకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించడం లేదు. దీనికి కార‌ణంగా రాధేశ్యామ్ చిత్రానికి విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం ప‌నిచేస్తున్న వారిలో ఎక్కువ శాతం విదేశీయులే ఉన్నారు. వారిపై క‌రోనా ప్ర‌భావం ప‌డ‌డంతో ప‌నుల్లోనూ జాప్యం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ మ‌రి కాస్త ఆలస్యం అయ్యే అవ‌కాశం ఉండ‌డంతో రాధేశ్యామ్ జూలై 30న వ‌చ్చే అవ‌కాశాలు దాదాపు లేన‌ట్లేన‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read: Regina Cassandra: అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ రెజీనా..

chiranjeevi acharya: రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ ‘ఆచార్య ‘ఫస్ట్ సాంగ్

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..

Follow Us
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?