పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ శంకర్
'గబ్బర్‌సింగ్' ... పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు క్రియేట్ చేసింది. సంచలన కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.

‘గబ్బర్‌సింగ్’ … పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు క్రియేట్ చేసింది. సంచలన కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త వినిపించబోతున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్.
పవన్ చేయబోతున్న 28వ సినిమాకు సంబంధించిన అప్డేట్ను పవన్ బర్త్‌డే రోజు సాయంత్రం 4:05 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లేదా పవన్‌కు జోడిగా నటించబోయే హీరోయిన్ వంటి వివరాలను తెలిపే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. పవర్ స్టార్.. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అవ్వగానే దర్శకుడు హరీశ్ శంకర్‌తో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
Yesssss!
The Update you’re looking for is Here!
September 2nd – 4:05 PM ?
POWERSTAR @PawanKalyan @harish2you ?
— Mythri Movie Makers (@MythriOfficial) August 31, 2020
Also Read :
ఏపీలో పింఛన్లు : నేటి నుంచే మళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి




