AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiraak RP: కిర్రాక్ న్యూస్ చెప్పిన ఆర్పీ.. చేపల పులుసు రీ ఓపెనింగ్ అప్పుడే.. ఈసారి ఇంకో స్పెషల్

త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతోన్న కిర్రాక్ ఆర్పీ తాజాగా కర్రీ పాయింట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో భాగంగానే కూకట్‌పల్లిలో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. కానీ మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల నెలలోపే దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది.

Kiraak RP: కిర్రాక్ న్యూస్ చెప్పిన ఆర్పీ.. చేపల పులుసు రీ ఓపెనింగ్ అప్పుడే.. ఈసారి ఇంకో స్పెషల్
Kiraak Rp Curry Point
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2023 | 3:15 PM

Share

జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు  కిరాక్‌ ఆర్పీ. ఎన్నో విభిన్న స్కిట్స్‌తో అలరించి.. టీమ్‌ లీడర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా నెల్లూరు యాసలో అతడు పేల్చే పంచ్‌లు, ప్రాసలు బాగా ఆకట్టుకునేవి. ఆ తర్వాత మెగా జడ్జి నాగబాబుతో  పాటు బయటకు వచ్చి.. అదిరింది షోలో కొన్నాళ్లు కొనసాగాడు. మధ్యలో డైరెక్షన్ ప్రయత్నాలు కూడా చేశాడు కానీ క్లిక్ అవ్వలేదు. తాను లవ్ చేసిన లక్కీ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలో వీరి మ్యారేజ్ జరగనుంది. అయితే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మల్లెమాల సంస్థపై ఆరోపణలు చేసి.. వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా యాక్టింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఆర్పీ.. ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరిట కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్ పెట్టాడు.

కొరమీను పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. బొమ్మిడాయిల పులుసు వంటి వంటకాలతో అటెన్షన్ గ్రాబ్ చేశాడు. నెల్లూరు చేపల పులుసు అంటేనే జనాలు ఇష్టపడతారు. అలాంటిది.. ఆర్పీ నెల్లూరు నుంచే చేపల తెచ్చి.. అక్కడి వాళ్లనే మాస్టర్లుగా పెట్టి.. మామిడికాయ వేసి.. కట్టెల పొయ్యి మీద చేసే చేపల పులుసుకు విపరీతమైన మార్కెట్ వచ్చింది. జనాలు అతడి షాపు ముందు క్యూ కట్టారు. విపరీతమైన బిజినెస్ జరిగింది. కానీ కస్టమర్స్ తాకిడి పెరగడంతో.. వారందరికీ చేపల పులుసు అందించలేకపోయాడు ఆర్పీ. దీంతో షాపు టెంపరరీగా క్లోజ్ చేసి.. నెల్లూరు వెళ్లి చెఫ్ హంట్ షురూ చేశాడు.

చేపలు పులుసు చేసుకుని.. తీసుకురావాలని.. మంచిగా చేసి.. రుచికరంగా అనిపిస్తే.. హైదరాబాద్ తీసుకెళ్లి.. సకల సౌకర్యాలు కల్పించి.. మంచి జీతం ఇస్తానని.. నెల్లూరులో చెఫ్ హంట్ విడుదల చేశాడు. అతడి పిలుపుకి గట్టిగానే రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 200 మంది వరకు తాము చేసిన చేపల పులుసును తీసుకుని.. ఆర్పీ చెప్పిన ప్లేసుకు వచ్చారు. వారిలో కొందర్నీ సెలక్ట్ చేశాడు ఆర్పీ. సంక్రాంతి అయిన వెంటనే వారందర్నీ తీసుకుని హైదరాబాద్ రానున్నాడు. ఆపై ఓ మంచి రోజు చూసి షాపు రీ ఓపెన్ చేయనున్నాడు. ఈ సారి కస్టమర్లను నిరాశపరచనని నమ్మకంగా చెబుతున్నాడు కిర్రాక్ ఆర్పీ. అంతేకాదు ఈసారి ఫిష్ లవర్స్ కోసం..  ఇంకో 2,3 రకాల వెరైటీలు కూడా అందుబాటులోకి తెస్తానని తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..