Brahmanandam : 1000కి పైగా సినిమాలు.. అయినా బాలీవుడ్‌కు వెళ్లని బ్రహ్మానందం.. కారణం ఇదేనట..
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో తనదైన నటనతో కట్టిపడేస్తున్నారు. 40 ఏళ్ల సినీప్రయాణంలో ఎన్నోచిత్రాలతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్లలేదనే విషయాన్ని చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమా ప్రపంచంలో నటనతో, కామెడీ టైమింగ్ తో తనదైన ముద్రవేశారు బ్రహ్మానందం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వేలాది చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో హాజరైన ఆయన తన ఆత్మకథను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా హాజరై, బ్రహ్మానందం పై ప్రశంసలు కురిపించారు. అయితే తెలుగులో వేలాది చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అందుకు సంబంధించిన ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. తాజాగా ఈ కార్యక్రమంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు బ్రహ్మానందం.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
తెలుగు సినిమా ప్రపంచంలో దాదాపు 40 సంవత్సరాలుగా సాటిలేని కామెడీ కింగ్ గా ఓ వెలుగు వెలిగారు బ్రహ్మానందం. అయినా హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. తన కామెడీ టైమింగ్, డిక్షన్ అన్నీ తెలుగు భాషలోనే మెరుగ్గా ఉంటాయని.. హిందీ తన మాతృభాష కాకపోవడంతో అక్కడ అదే స్థాయి ఇంపాక్ట్ ఇవ్వలేనన్న నమ్మకం కారణంగా బాలీవుడ్ ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు. కామెడీ అనేది కేవలం జోకులు కాదని.. భాషా ఉచ్చారణ, వేగం నటనలోని చిన్నచిన్న మార్పులు అన్నీ కలిసొచ్చినప్పుడే ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
అయితే హిందీ సినిమాల్లో బ్రహ్మానందం నటించకపోయినా తెలుగు చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి. అలాగే తన ముఖ కవలికలు, యాక్టింగ్ జనాలకు నవ్వు తెప్పిస్తుంది. అంతేకాదు.. కామెడీ మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన మీమ్స్ రారాజు. ఆయనకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో గ్లోబల్ కామెడియన్ అవార్డ్ అందుకున్నారు బ్రహ్మానందం. ఆయన ప్రతిభకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..




