
టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాల సినీప్రయాణంలో ఇప్పటివరకు 1200కి పైగా చిత్రాల్లో నటించి.. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్లతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. అద్భుతమైన నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించాడు. అత్యధికంగా సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సైతం చోటు సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఓ సీన్ క్రియేట్ చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. తాజాగా తన కుమార్ గౌతమ్ తో కలిసి బ్రహ్మా ఆనందం అనే సినిమాలో నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. అదే సమయంలో తన స్నేహితుడు ఎమ్మెస్ నారాయణను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి, సినీ ప్రయాణం గురించి చెప్పుకోచ్చారు. అదే సమయంలో ఎమ్మెస్ నారాయణ తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని కాగితం మీద రాసి ఇచ్చారట కదా అని యాంకర్ అడగ్గా.. బ్రహ్మానందం మాట్లాడుతూ.. “నేను సంపాదించుకున్న సంపది అది.. ఒక వ్యక్తి.. ఒక జీనియర్. తన డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి. అతడికి ఎంతోమంది తెలుసు.. ఎన్నో పరిచయాలు ఉన్నాయి. తల్లిదండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు ఇలా అనేక బంధాలు ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో ఓ వ్యక్తిని చూడాలి అనిపించడం.. ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని అనిపించడం.. చెప్పలేని నోటితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైగ చేసి తన కూతురుతో తెల్ల కాగితం మీద బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి ఇస్తే.. ఆ అమ్మాయి అది చదువుకుని నాకు ఫోన్ చేసింది. ఎక్కుడ శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్ లో ఉన్న నేను దర్శకుడి దగ్గరకు వెళ్లి చెప్పి అడిగితే నో అంటారేమో అని అలాగే కారు ఎక్కేసి వెళ్లిపోయాను. అది వేరే విషయం అనుకోండి.
అక్కడి నుంచి ఎమ్మెస్ నారాయణను చూడటానికి వెళ్లగానే బెడ్ పై నుంచి నన్ను చూసి అతడి రెండు కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నేను ఎప్పటికీ ఆ సీన్ మర్చిపోలేను. నన్ను చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకొని వదిలేశాడు. తర్వాత డాక్టర్ తో మాట్లాడను.. ఆయన నా రక్త సంబంధం కాదు. కానీ ఓ ఎమోషన్. అదే హ్యుమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులో వెళ్లిపోతాడన్నది నేను జీర్ణించుకోలేకపోయాను. అతడు కమెడియన్ మాత్రమే కాదు. ఆయన వేసే పంచులు ఊహించని విధంగా ఉంటాయి ” అంటూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన