Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని చూసి బ్రహ్మానందం ఎమోషనల్..
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం ఆయన భౌతికకాయానికి నటులు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు. కోట పార్థివదేహాన్ని చూసి బ్రహ్మానందం కన్నీటిపర్యంతం అయ్యారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట.. తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. 750కి పైగా సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. 2. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనుసు చొరగొన్నారు. కోట భౌతికకాయానికి నివాళులర్పించారు నటుడు బ్రహ్మానందం. కోట భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోట శ్రీనివాసరావు మహానటుడని చెప్పారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు. కోట లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు బ్రహ్మానందం.




