AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shekar Master: శేఖర్ మాస్టర్‏ మథర్‏ను చూశారా ?.. తొలిసారి తల్లితో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్..

శేఖర్ మాస్టర్ వారసులు సాహితి, విన్నీ.. తండ్రిలాగే డాన్స్ తో మెప్పించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. శేఖర్ మాస్టర్ మథర్ ను ఎప్పుడైనా చూశారా ?.. అసలు ఇప్పటివరకు చూసుండరు. కానీ.. మొదటిసారి శేఖర్ మాస్టర్ తన తల్లితో కలిసి స్టేజ్ పై డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Shekar Master: శేఖర్ మాస్టర్‏ మథర్‏ను చూశారా ?.. తొలిసారి తల్లితో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్..
Shekar Master
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2024 | 1:37 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ప్రస్తుతం ఆయన ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటు స్టార్ హీరోల సినిమాకు కొరియోగ్రాఫర్ గా ఉంటూనే.. అటు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు. ఫేమస్ రియాల్టీ షో ఢీ డాన్స్ షోలో జడ్జీగా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే కొత్త డాన్సర్స్, యువ డ్యాన్సర్లను పోత్సహిస్తున్నారు. కేవలం శేఖర్ మాస్టర్ మాత్రమే కాదు.. అతడి ఫ్యామిలీ కూడా జనాలకు సుపరిచితమే. ఆయన భార్య, పిల్లలు ఆడియన్స్ ముందుకు వచ్చారు. శేఖర్ మాస్టర్ వారసులు సాహితి, విన్నీ.. తండ్రిలాగే డాన్స్ తో మెప్పించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. శేఖర్ మాస్టర్ మథర్ ను ఎప్పుడైనా చూశారా ?.. అసలు ఇప్పటివరకు చూసుండరు. కానీ.. మొదటిసారి శేఖర్ మాస్టర్ తన తల్లితో కలిసి స్టేజ్ పై డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ మొత్తం జనాలకు సుపరిచితమే. ఆయన భార్య, కూతురు, కొడుకు ఇదివరకు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొన్నారు. ఇక ఆయన కొడుకు మాత్రం డాన్స్ అదరగొట్టేస్తుంటాడు. పలు షోలలో డాన్స్ తో మెప్పించాడు. తాజాగా ఓ ఛానల్లో జరిగిన వాలెంటైన్స్ డే షోలో తన తల్లిని అందరికి పరిచయం చేశాడు శేఖర్ మాస్టర్. ఢీ షోకు శేఖర్ మాస్టర్ తల్లి అతిథిగా వచ్చారు. వాలెంటైన్స్ డే స్పెషల్ షోకు అతిథిగా వచ్చారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికి డాన్స్ కొరియోగ్రాఫీ చేస్తోన్న శేఖఱ్ మాస్టర్ తన తల్లితో కలిసి డీ స్టేజీ పై డాన్స్ చేసి సంతోషపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

శేఖర్ మాస్టర్ 1979 నవంబర్ 6న విజయవాడలో జన్మించారు. 1996లో బ్యాగ్రౌండ్ డాన్సర్ గా సభ్యత్వ కార్డును తీసుకున్నారు. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ దగ్గర కొంతకాలం వర్క్ చేశారు. మూవీ కొరియోగ్రాఫర్ కావడానికి ఆరు సంవత్సరాలు బ్యాగ్రౌండ్ డాన్సర్ గా.. ఎనిమిది సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేశాడు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రాఫీ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..
అర్ధరాత్రి వసతిగృహంలో ఒక్కసారిగా అలజడి.. పరుగులు పెట్టిన జనం..
అర్ధరాత్రి వసతిగృహంలో ఒక్కసారిగా అలజడి.. పరుగులు పెట్టిన జనం..