AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj : స్పెయిన్ వెళ్లాలనుకున్నాడు..కానీ ఒక్క కాల్‌తో సీన్ రివర్స్..వాంఖడేను వణికించిన హైదరాబాదీ నవాబ్

Mohammed Siraj : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా బోణీ కొట్టింది. అమెరికాపై జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్‌తో అదరగొడితే, బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు.

Mohammed Siraj : స్పెయిన్ వెళ్లాలనుకున్నాడు..కానీ ఒక్క కాల్‌తో సీన్ రివర్స్..వాంఖడేను వణికించిన హైదరాబాదీ నవాబ్
Mohammed Siraj
Rakesh
|

Updated on: Feb 08, 2026 | 10:28 AM

Share

Mohammed Siraj : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా బోణీ కొట్టింది. అమెరికాపై జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్‌తో అదరగొడితే, బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. అయితే ఈ మ్యాచ్‌కు 48 గంటల ముందు వరకు సిరాజ్ అసలు వరల్డ్ కప్ ఆడుతాడని ఎవరూ ఊహించలేదు. స్వయంగా సిరాజ్ కూడా మరో దేశానికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ ఒక్క ఫోన్ కాల్ ఆయన తలరాతను మార్చేసింది.

టీ20 ప్రపంచకప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో మొదట మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. దీంతో ఆయన తన పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టాడు. తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ ఆడే మ్యాచ్ చూసేందుకు ఫిబ్రవరి 15న స్పెయిన్ వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ, సరిగ్గా టోర్నీకి ఒక రోజు ముందు హర్షిత్ రాణా గాయపడటంతో సెలెక్టర్ల చూపు సిరాజ్ వైపు మళ్లింది. దీనికి తోడు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం బారిన పడటంతో, మొదటి మ్యాచ్‌లోనే సిరాజ్ మైదానంలోకి దిగాల్సి వచ్చింది.

భారత్ విజయం సాధించిన తర్వాత సిరాజ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. “సూర్య భాయ్ నాకు ఫోన్ చేసి.. మియా.. నీ బ్యాగ్ సర్దుకుని వెంటనే ముంబైకి వచ్చేయ్’ అన్నాడు. నేను జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ సూర్య భాయ్ సీరియస్ అని చెప్పాడు. ఆ తర్వాత సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా భాయ్ నుంచి కూడా కాల్ రావడంతో అంతా నిజమేనని అర్థమైంది. నేను స్పెయిన్ వెళ్లాలనుకున్నాను, కానీ దేవుడు నాకోసం మరో గొప్ప ప్లాన్ రాశాడు” అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 161 పరుగులు చేయగా, ఆ స్కోరును కాపాడటంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తన స్పెల్ లోని మొదటి రెండు ఓవర్లలోనే ఇద్దరు అమెరికా ఓపెనర్లను అవుట్ చేసి ఆ జట్టును ఆత్మరక్షణలో పడేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అప్పటి వరకు స్పెయిన్ ట్రిప్ గురించి ఆలోచిస్తున్న అభిమానులు, సిరాజ్ వికెట్లు తీస్తుంటే హర్షధ్వానాలు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..