AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘చాలా ఆనందంగా ఉంది’..ప్రధాని మోడీతో మీటింగ్‌పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు, వ్యాపార వేత్తలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం (ఫిబ్రవరి 07) రాత్రి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Chiranjeevi: 'చాలా ఆనందంగా ఉంది'..ప్రధాని మోడీతో మీటింగ్‌పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
PM Narendra Modi, Chiranjeevi
Basha Shek
|

Updated on: Feb 08, 2025 | 11:10 AM

Share

భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేక్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(WAVES)’ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. తాజాగా ఈ కీలక సమ్మిట్ కు సంబంధించిన ప్రధాని మోడీ భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు, వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వేవ్స్ సమ్మిట్ కోసం ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌,షారుఖ్‌ఖాన్‌,ఆమిర్‌ఖాన్‌, అనిల్‌ కపూర్‌, మిథున్‌ చక్రవర్తి, అక్షయ్‌కుమార్‌, హేమమాలినీ, దీపికా పదుకొణె హాజరయ్యారు. దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్‌, నాగార్జున,ఎ. ఆర్. రెహమాన్ లకు అవకాశం దక్కింది. ఈ భేటీ పూర్తి అయిన తర్వాత మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సమావేశం గురించి మరోసారి ప్రస్తావించారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రధాని మోడీతో మాట్లాడుతోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన..

‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి ఈ సమావేశంలో పాలు పంచుకోవడం నిజంగా ఒక విశేషం. మోదీ జీ #WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. సాఫ్ట్ పవర్’ ప్రపంచంలో అతి త్వరలో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇందులో నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జీ గారికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

సినీ ప్రముఖులతో పాటు భారత వ్యాపార దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా కూడా ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వేవ్స్ సమ్మిట్ పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..