AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Re Release Movies: రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న మరో రెండు సూపర్ హిట్ సినిమాలు.. చిరంజీవితో పాటు అక్కినేని హీరో కూడా

మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. పోటీపడుతూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి ఓల్డ్ సినిమాలు. అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా మహేష్ బాబు బిజినెస్ మెన్, ప్రభాస్ యోగి సినిమా రీ రిలీజ్ అయ్యి విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

Re Release Movies: రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న మరో రెండు సూపర్ హిట్ సినిమాలు.. చిరంజీవితో పాటు అక్కినేని హీరో కూడా
Naga Chaitanya, Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2023 | 10:43 AM

Share

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హంగామా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. పోటీపడుతూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి ఓల్డ్ సినిమాలు. అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా మహేష్ బాబు బిజినెస్ మెన్, ప్రభాస్ యోగి సినిమా రీ రిలీజ్ అయ్యి విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే వాటితో పాటు మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఒకటి. హిందీలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమానా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మెగాస్టార్ నటన, ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అవుతుందా లేక ఆ తర్వాత రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా రీ రిలీజ్ అని తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమాను రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికీ చాలా మందికి ఫెవరెట్ మూవీ. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలే కాదు ఈ ఏడాది చివరిలోగా 12 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Rishibeats✨ (@rishibeats_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?