Dulquer Salmaan: ఆమె అసభ్యకరంగా తాకింది.. నాకు చాలా బాధకలిగించింది.: దుల్కర్ సల్మాన్.
దుల్కర్ సల్మాన్.. తన సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. మహానటితో తెలుగులో అడుగుపెట్టిన ఈ హీరో సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. మలయాళంలో దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం దుల్కర్‌సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోథా, గన్స్ అండ్ గులాబ్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
దుల్కర్ సల్మాన్.. తన సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. మహానటితో తెలుగులో అడుగుపెట్టిన ఈ హీరో సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. మలయాళంలో దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం దుల్కర్‌సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోథా, గన్స్ అండ్ గులాబ్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన తన పర్సనల్, వర్క్ లైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తనకు ఎదురైన ఆసక్తికరల విషయాలను పంచుకున్నారు. ఓకే కన్మని, సీతారామం సినిమాల తర్వాత కేరళలో తనుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని తెలిపారు. సాధారణంగా తనకు బాయ్స్‌లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారని, వాళ్లతో తాను ఎప్పుడూ టచ్‌లో ఉంటానన్నారు.
అయితే కొందరి అభిమానుల వల్ల తాను ఇబ్బందిపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారని, వాళ్ల ప్రవర్తన తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. గతంలో ఒక పెద్దావిడ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని, ఆమె తనను అభ్యంతరకరంగా తాకిందని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. తన పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా దుల్కర్ చెప్పారు. 28 ఏళ్ల వయసులోనే తనకు పెళ్లైందన్నారు. అమాల్ సోఫియా, తనూ ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, తనని కలిసినప్పుడే ఆమె తన జీవితం, కుటుంబంలో భాగమని అర్థమైందని వివరించారు. అంతకు ముందు ఏ అమ్మాయిని చూసినా తనకు అలాంటి భావం కలగలేదన్నారు. పెళ్లి, కెరీర్.. తనకు ఒకేసారి మొదలయ్యాయని తెలిపారు. కొంచెం ఖాళీ సమయం దొరికినా తనతో గడపటానికి ఇష్టపడతానని వివరించారు. కాగా కింగ్ ఆఫ్ కోథా, మూవీ ఆగస్టు 24న రిలీజ్ కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...