Chiranjeevi: చనిపోతూ మరొకరి జీవితాల్లో వెలుగులు నింపిన అల్లు కనకరత్నమ్మ.. మీరు నిజంగా బంగారమే..

దివంగత అల్లు రామలింగయ్య భార్య, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అల్లు, మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. ఇదే సందర్భంగా కనకరత్నమ్మ గురించి చిరంజీవి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు.

Chiranjeevi: చనిపోతూ మరొకరి జీవితాల్లో వెలుగులు నింపిన అల్లు కనకరత్నమ్మ.. మీరు నిజంగా బంగారమే..
Allu Kanakaratnamma, Chiranjeevi

Updated on: Aug 31, 2025 | 9:39 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూశారు. గ‌త కొన్నాళ్లుగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె శనివారం (ఆగస్టు 30 తుదిశ్వాస విడిచారు. దీంతో మెగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక చిరంజీవి ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అన్ని పనులు చూసుకున్నారు. అత్తమ్మ పాడె కూడా మోసి తుది వీడ్కోలు పలికారు. అయితే కనక రత్నమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సాయంత్రం ఓ హాస్పిటల్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అత్తమ్మ చేసిన ఓ గొప్ప పని గురించి అందరితో పంచుకున్నారు.

‘ ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మా అత్తగారు లేరు అనే వార్త వచ్చింది. అల్లు అరవింద్ ఇక్కడ లేరు, బెంగుళూరులో ఉన్నారు. నేను వెంటనే వెళ్లాను. ఆ సమయంలో మేము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ విషయం గుర్తుకు వచ్చింది. ఆ అర్ధరాత్రి సమయంలో మా బ్లడ్ బ్యాంక్ స్వామి నాయుడుకి ఫోన్ చేసి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టెక్నిషియన్స్ ని కనుక్కోమని ఈ లోపు నేను ఆవిడ ఐ డొనేషన్ కి అంతా రెడీ చేస్తాను అని చెప్పాను.. ఈ లోపు నేను అరవింద్ కు ఫోన్ చేసి ఇలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నాకు అత్తమ్మ గారికి, మా అమ్మ గారికి మధ్య ఒక సారి ఇదే విషయంపై మాట్లాడకున్నాం. ‘ మీరు ఇస్తారా’ అని అడిగాను. కాలి బూడిద అయ్యే శరీరానికి చచ్చిపోయాక ఏం చేస్తాం అలాగే నీ ఇష్టం ఇచ్చేద్దాం అన్నారు. ‘అవయవదానం గురించి మా అత్తమ్మ ఎక్కడా సంతకం పెట్టలేదు కానీ నాకు ఆ మాటే ప్రతిజ్ఞ లాగా అనిపించింది. ఇదే విషయమై ‘ఏం చేయమంటావ్’  అని అరవింద్ ను అడిగితే ఓకే చేసేయి అన్నాడు. ఇవాళ ఉదయం ఆమె కళ్లను  తీసి ఆస్పత్రికి పంపించాం’  అని చిరంజీవి చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫోన్ లో నుంచి మీడియాకు చూపించారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

 

అత్తమ్మ చేసిన గొప్ప పని గురించి చిరంజీవి మాటల్లో.. వీడియో..

ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది. అల్లు కనకరత్నత్మ చేసిన గొప్ప పనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.