AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దెకట్టుకునేంత డబ్బులు వచ్చినా చాలు అనుకున్నా.. తర్వాత అందరికంటే ఎక్కువ నాకే

జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా , కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు.

అద్దెకట్టుకునేంత డబ్బులు వచ్చినా చాలు అనుకున్నా.. తర్వాత అందరికంటే ఎక్కువ నాకే
Chammak Chandra
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2026 | 11:56 AM

Share

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ వేదికపై తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను అలరించాడు చమ్మక్ చంద్ర. తన కామెడీతో ఎంతో మంది ఆడియన్స్ ను నవ్వులుపూయించాడు. సినిమాల్లోనూ నటించి మెప్పించాడు చమ్మక్ చంద్ర. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జబర్దస్త్ తెచ్చిన మలుపు గురించి వివరించారు. ఈ ప్రయాణం తనలో ఆర్థిక స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపిందో ఆయన పంచుకున్నారు. మొదట్లో జబర్దస్త్ లో మూడు, నాలుగు ఎపిసోడ్‌లు చేసిన తర్వాత, సుమారు పది నుంచి పన్నెండు ఎపిసోడ్‌లు పూర్తయ్యేసరికి తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలననే నమ్మకం కలిగిందని చంద్ర పేర్కొన్నారు. “ఇకపై నూకలు కొనుక్కోవాల్సిన పని లేదు, మంచి కూరలు తెచ్చుకోవచ్చు” అనే రిలాక్స్డ్ భావన అప్పుడే ప్రారంభమైందని ఆయన తెలిపాడు. జబర్దస్త్ తనకంటూ ఒక మంచి పేరును తీసుకువచ్చిందని, ఆ పేరుతో నాలుగు సినిమాలైనా చేయగలననే ఆత్మవిశ్వాసం పెరిగిందని చమ్మక్ చంద్ర తెలిపారు.

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

యూట్యూబ్‌లో రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉండటంతో, భవిష్యత్తులో కూడా తన ప్రదర్శనలు రికార్డులుగా ఉంటాయని, ఇది తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన నమ్మారు. ఈ గుర్తింపుతో ఎంతో కొంత బతకడానికి ఇక ఇబ్బంది ఉండదని, ముందు ఇచ్చే రూపాయి కంటే కొద్దిగా ఎక్కువ అడిగైనా హ్యాపీగా జీవించవచ్చని, అద్దె కట్టుకోవచ్చని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలను అనే ధైర్యం వచ్చిందని వివరించారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని, మనిషి విజయాన్ని డబ్బుతోనే కొలుస్తారని ఒక సాధారణ అభిప్రాయాన్ని చమ్మక్ చంద్ర తెలిపాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

ఎంత విజయం సాధించినా ఆర్థికంగా బలంగా లేకపోతే ఏ బంధమైనా నిలబడదని చెప్పుకొచ్చాడు చంద్ర. జబర్దస్త్ లో ఎనిమిది నుంచి తొమ్మిది ఎపిసోడ్‌ల తర్వాత, తాను ఏంటో నిరూపించుకోగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రారంభంలో అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ, తన ప్రతిభను చాటుకున్నాక, “నాకు ఇంత కాదండీ, నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, అయితేనే చేస్తా” అని డిమాండ్ చేయగలిగే స్థితికి చేరుకున్నానని చమ్మక్ చంద్ర వెల్లడించారు. తనదైన ప్రత్యేక జోనర్, ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నానని, ఇది తన కెరీర్‌కు మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. జబర్దస్త్ తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us