
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ జాట్. ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. హిందీతోపాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా విడుదల కాగా.. ఇక్కడ అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. మొదటి వారంలోనే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక త్వరలోనే జాట్ 2 సినిమానూ సైతం తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.
ఈ సినిమాలోని ఓ సన్నివేశం క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ పంజాబ్ లోని జలంధర్ కు చెందిన వికల్ప్ గోల్డ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జాట్ హీరో సన్నీడియోల్ విలన్ గా నటించిన రణబీద్ హుడా, డైరెక్టర్ గోపిచంద్ మలినేని, నిర్మాత నవీన్ ఎర్నేనిలపై భారతీయ న్యాయ సంహితలోని 299 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో ఏసుక్రీస్తు శిలువను కించపరిచేలా చూపించారని.. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చే నెలలోనే ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయడమేనని.. ఇలాంటి చర్యకు పాల్పడిన ఈ సినిమా టీంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం జాట్ మూవీకి మాత్రం నార్త్ అడియన్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సన్నీ డియోల్ నుంచి ఫ్యాన్స్ ఆశించే ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ తో డైరెక్టర్ గోపిచంద్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఎస్. థమన్ సంగీతం అందించగా.. ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో జాట్ మూవీ వివాదంలో చిక్కుకోవడంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి :