Tollywood : కేవలం 2 సినిమాలతో 750 కోట్లు వసూలు చేసిన హీరోయిన్.. కానీ ఇప్పుడు స్పెషల్ పాటలతో..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు దాదాపు 20 సంవత్సరాల క్రితం సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో నటిస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 35 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక ఇటీవలే లవ్, బ్రేకప్ అంటూ కొన్ని రోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇటీవలే తమిళంలో రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. సూపర్ స్టార్ రజినీతో కలిసి ఆమె నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన తమన్నా..
అభిమానులు ఆమెను ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఎస్.ఎ దర్శకత్వం వహించిన కేడీ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. గ్లామర్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటింది తమన్నా. విజయ్, అజిత్, చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. తమన్నా గతేడాది బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల తమన్నా నటించిన సూపర్ హిట్ సినిమాలు జైలర్, అరణ్మనై 4. వీటిలో జైలర్ సినిమా రూ.650 కోట్లు రాబట్టింది. అలాగే అరణ్మనై సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు, తమిళం సినిమాలు లేవు. కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




