Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Anushka

Updated on: Sep 15, 2025 | 3:05 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు సినిమా ప్రపంచంలో ఆమె తోపు హీరోయిన్. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్, రానా వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది. ఎప్పుడో ఒక సినిమాతో జనాల ముందుకు వస్తుంది. అప్పట్లో వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ అనుష్క శెట్టి. ఇటీవలే ఘాటి చిత్రంతో థియేటర్లలో సందడి చేసింది.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

ఇవి కూడా చదవండి

అనుష్క శెట్టి దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. నాగార్జున, సోనూసూద్ ప్రధాన పాత్రలలో నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు అవర్ మంగళూరు బ్యూటీ ఒక హిందూ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్‌లో కూడా పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్నప్పుడు ఆమె నటనలో సంవత్సరాలుగా ఎంత మార్పు వచ్చిందో చెప్పవచ్చు. తెలుగులో సూపర్ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘అరుందతి’తో ఒక్కసారిగా సెస్సేషన్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

ఒకప్పుడు బెంగళూరులోని ఈస్ట్‌వుడ్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసింది. ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందు యోగా బోధకురాలిగా కూడా పనిచేశారు. దక్షిణాదిలో అనుష్క ‘బాహుబలి 1, 2, ‘సింగం 3’ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..