Guess the actress: సముద్రపు ఒడ్డున అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడికి డేరింగ్ ఎక్కువ.
ప్రస్తుతం అంతా సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సమ్మర్ హాలీడేస్ ముగుస్తున్న నేపథ్యంలో టూర్‌లకు ప్లాన్ చేస్తున్నారు కొందరైతే, ఇప్పటికే టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న వారు మరికొందరు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు విదేశాల్లో వాలిపోయిన బీచ్‌లలో...
ప్రస్తుతం అంతా సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సమ్మర్ హాలీడేస్ ముగుస్తున్న నేపథ్యంలో టూర్‌లకు ప్లాన్ చేస్తున్నారు కొందరైతే, ఇప్పటికే టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న వారు మరికొందరు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు విదేశాల్లో వాలిపోయిన బీచ్‌లలో సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు బికినీల్లో దర్శనమిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. మొన్నటి మొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ బికినీలో కనిపించి పరేషన్ చేయగా తాజాగా మరో బ్యూటీ ఇలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
పైన సముద్రపు ఒడ్డున నిల్చున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? బ్లాక్ బికినీలో సముద్రానికే చెమట పుట్టిస్తున్న ఈ చిన్నది తెలుగు సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రకు ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పోల్చితే హిందీలో భారీగా అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించి బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కేవలం సినిమాలతో కాకుండా కాంట్రవర్సీలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుందీ చిన్నది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో ఇపాటికే మీకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది కదూ! అవును మీ గెస్ కరెక్టే.. ఈ చిన్నది మరెవరో కాదు. అందాల తాప్సీనే.
View this post on Instagram
ప్రస్తుతం హిందీ చిత్ర సీమలో దుమ్మురేపుతోన్న ఈ చిన్నది ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తోంది. సముద్రపు ఒడ్డున హొయలొలికిస్తూ రచ్చ చేస్తోంది. ఇక తాప్సీ కెరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఇదే ఏడాది డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు రామ్ కుమార్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తాప్సీ హసీన్ దిల్రూబా 2 లో నటించనుంది. ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కూడా కనిపించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..