Tollywood: 90’sలో సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కుర్రాడు.. అంతలోనే హీరోగా మాయమై ఆ తర్వాత..
90'sలో అతడి సినిమాలంటే అమితంగా ఇష్టపడే అభిమానులు ఉన్నారు. అప్పట్లో అభిమానులంతా అతడిని చాక్లెట్ బాయ్ అని ముద్దుగా పిలుచుకునేవారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న సమయంలోనే అనుకోకుండా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెండితెరపై తనదైన నటనతో అలరించిన ఆ కుర్రాడు.. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నాడు.
ఇటీవల సోషల్ మీడియాలో సినీ నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి కదా. అందుకే మీకోసం ఇప్పుడు ఒకప్పటి స్టార్ చిన్ననాటి ఫోటోను తీసుకువచ్చాం. పైన ఫోటోలో అమాయకపు చూపులతో.. చిరునవ్వుతో కనిపిస్తున్న కుర్రాడిని చూశారా..? ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అతడు సంచలనం. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతేకాకుండా తొలి సినిమాతోనే సూపర్ స్టార్ హీరోల జాబితాలలో పేరు చేర్చుకున్నాడు. 90’sలో అతడి సినిమాలంటే అమితంగా ఇష్టపడే అభిమానులు ఉన్నారు. అప్పట్లో అభిమానులంతా అతడిని చాక్లెట్ బాయ్ అని ముద్దుగా పిలుచుకునేవారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న సమయంలోనే అనుకోకుండా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెండితెరపై తనదైన నటనతో అలరించిన ఆ కుర్రాడు.. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నాడు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఆ హీరో ఎవరో మీరు గుర్తుపట్టగలరా ..?. ఇప్పటికీ అతడి తొలి చిత్రం ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన మూవీ. అలాగే మ్యూజికల్ సెన్సెషన్ కూడా . అతడే కోలీవుడ్ స్టార్ ప్రశాంత్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. ఐశ్వర్యరాయ్ నటించిన జీన్స్ మూవీ హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
ప్రశాంత్ 1973 ఏప్రిల్ 6న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి త్యాగరాజన్ తమిళ సినీ పరిశ్రమలో దర్శకనిర్మాత. దీంతో చిన్నప్పటి నుంచే సినీ వాతావరణాన్ని చూశాడు. 1990లో రొమాంటిక్ డ్రామా వాగసి పోరనాచ్చు మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు ప్రశాంత్. అప్పుడు అతడి వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. దీంతో ప్రశాంత్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడ్డారు. దాదాపు 43 సినిమాల్లో హీరోగా కనిపించాడు. తమిళం, మలయాళం, తెలుగులో, హిందీ చిత్రాల్లో నటించాడు. 2002లో విడుదలైన పార్థేన్ రసితేన్ సినిమాలో స్వయంగా ఓ పాట పాడారు. అలాగే 2016లో సగసం అనే తమిళ్ మూవీ నిర్మించి నిర్మాతగా మారారు.
1998లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమా అతడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ మూవీ అతడికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇందులో ఐశ్వర్యరాయ్ కథానాయికగా నటించగా.. అప్పట్లో వీరిద్దరి జోడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. 2000 తర్వాత ప్రశాంత్ సినిమాలు నిరాశ మిగిల్చాయి. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనే కొన్ని సమస్యలు రావడంతో సినిమాలకు దూరమయ్యాడు ప్రశాంత్. 2005లో గృహలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 2011లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమాలో చరణ్ పెద్దన్నయ్యగా కనిపించారు. ప్రస్తుతం సినిమాల్లో సహాయ పాత్రలలో నటిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.