Buchi Babu Sana : మహేష్ సినిమాకు క్లాప్ కొట్టిన ఉప్పెన దర్శకుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో…
'ఉప్పెన' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు దర్శకుడు బుచ్చి బాబు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చి.
Buchi Babu Sana : ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు దర్శకుడు బుచ్చి బాబు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చి. మొదటి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైష్ణవ్ తోపాటు కృతిశెట్టి కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా పై టాలీవుడ్ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు.బుచ్చి డైరెక్షన్ ను ప్రతిఒక్కరు మెచ్చుకుంటున్నారు. అయితే బుచ్చి బాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలు చేసాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాకు కూడా బుచ్చి వర్క్ చేసాడు. ఆ మూవీ షూటింగ్ సమయంలో మహేష్ పై బుచ్చి బాబు క్లాప్ కొడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోని మహేష్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుచ్చి బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడంటూ ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సినిమా పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bell Bottom movie : రా ఏజంట్ గా రానున్న ఖిలాడి హీరో.. అక్షయ్ బెల్ బాటమ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..