మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ఇంతలో షూటింగ్‌లో ప్రమాదం.. కన్నుమూసిన స్టార్ హీరో
సినిమా సెట్స్ లో ఊహిచని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. ఇప్పటికే చాలా మంది హీరోలు అనుకోకుండా గాయపడుతూ ఉంటారు. స్టార్ హీరోలు చాలా మంది యాక్షన్ సీన్స్ లో గాయపడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మందికి సర్జరీలు కూడా చేయించుకున్నారు. అయితే ఓ హీరో షూటింగ్ లో చనిపోయాడం తీవ్ర విషాదాన్ని నింపింది.

సినిమా షూటింగ్స్‌లో ఎంతోమంది హీరోలు, చిత్రయూనిట్ గాయపడుతూ ఉంటారు. సినిమా షూటింగ్స్ లో స్టంట్స్ చేసే సమయంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఒకప్పుడు చాలా వరకు యాక్షన్ సీన్స్ ను డుప్స్ తో పెట్టి లాగించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.. హీరోలే యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఎలాంటి రిస్క్ అయినా సరే హీరోలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది హీరోలు అనుకోని ప్రమాదాల బారిన పడ్డారు. కొంతమంది షూటింగ్స్ లో జరిగిన ప్రమాదాల్లో మరణించారు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మరణించాడు.. అంతకన్నా దారుణం ఏంటంటే కొద్దిరోజుల్లోనే ఆ హీరో పెళ్లి.. ఇంతలోనే షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఆ హీరో ఎవరో తెలుసా.?
ఈ హీరో తండ్రి ఓ స్టార్ హీరో.. ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్న సమయంలోనే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ హీరో.. చైనీస్ సూపర్‌స్టార్లు చాలా మంది తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. అలాంటి వారిలో బ్రుస్ లీ ఒకరు. బ్రుస్ లీ తెలియనివారు వారు ఉండరు. చైనాలోనే కాదు ఇండియాలోనూ బ్రుస్ లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ్రుస్ లీ కొడుకు బ్రాండన్ లీ చాలా మందికి తెలిసే ఉంటుంది.
అయితే బ్రాండన్ లీ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమా ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ డమ్మీ తుపాకీతో హీరోని షూట్ చెయ్యాలి.. కానీ సెట్ లో రియల్ గన్ కూడా ఉపయోగించారు. గన్ లో నుంచి బుల్లెట్ వచ్చే షాట్ ను క్లోజప్ లో షూట్ చేయాలని నిజమైన తుపాకీ కూడా వాడారు. అయితే అక్కడ ఉన్న విలన్ పాత్ర చేసిన వ్యక్తి డమ్మీ తుపాకీ అనుకోని రియల్ గన్ తో హీరోని షూట్ చేశాడు. దాంతో అతను అక్కడే కూలిపోయాడు. అయితే అందరూ బ్రాండన్ లీ నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ ఎంత సేపటికీ బ్రాండన్ లీ లేగకపోవడంతో డైరెక్షన్ టీమ్ వెళ్లి చూడగా ఆయన అప్పటికే కన్నుమూశారు. దారుణం ఏంటంటే మరికొద్ది రోజుల్లో బ్రాండన్ లీ పెళ్లిజరగనుంది. బ్రాండన్ లీ మరణం నుంచి ఆయన ఫ్యామిలీ చాలా కాలం కోలుకోలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
