Raja Goutham : బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా కొత్త సినిమా షురూ అయ్యింది..
కామెడీ కింగ్ బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Raja Goutham : కామెడీ కింగ్ బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కె.రాఘవేంద్రరావు ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అంతగా హిట్టవ్వలేదు. బసంతి, మను లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి నటుడిగా మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు గాని కమర్షియల్ గా హిట్స్ అందుకోలేదు. కొత్త తరహా కథ లతో ప్రేక్షకులకు దగ్గరయిన గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతున్న ఈ మూవీ తో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు.
యస్ ఒరిజినల్స్ నిర్మాణం లో పదో సినిమా గా రూపొందుతున్న ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ ను తెర మీద పరిచయం చేయబోతుంది. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :