Faria Abdullah : ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న చిట్టి..

ఈ మధ్య కాలంలో చిట్టి అంటే గుర్తొచ్చే బ్యూటీ హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

Faria Abdullah : ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న చిట్టి..
ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2021 | 8:50 AM

Faria Abdullah: ఈ మధ్య కాలంలో చిట్టి అంటే గుర్తొచ్చే బ్యూటీ హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతిరత్నాలు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో అమాయకు అమ్మాయిలా ఫరియా అబ్దుల్లా నటన అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతర్వాత ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మరో సినిమాలో నటించలేదు. ఇటీవల విడుదలైన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి అదిరిపోయే అఫర్ వాచినట్టు తెలుస్తుంది. హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా కూడా ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తుంది.

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. అలాగే నాగ్ హీరోయిన్ గా సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ కనిపించనున్నారు. అలాగే చైతూకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి కనిపించనుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఫరియా అబ్దుల్లా నటించనుందట. అయితే నాగార్జునతో ఈమె చేయబోతున్న ఆ ఐటెం సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. అంతే కాదు బంగార్రాజు సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా ఫరియా అబ్దుల్లాకు ఎలా ప్లెస్ అవుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..