Boyapati Srinu: స్కందతో అఖండను మించి సక్సెస్ కొట్టాలని చూస్తున్న బోయపాటి
సినిమా రిలీజ్‌కి వచ్చేస్తుందంటేనే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కావచ్చిందంటేనే.. అందరి దృష్టి ఆ మూవీకి పనిచేసిన హీరో - డైరక్టర్ల ప్రీవియస్ రికార్డుల మీదకు వెళ్తుంది. ఇప్పుడు స్కంద సినిమాతో బరిలో పోటీకి దిగుతున్న బోయపాటి - రామ్‌పోతినేని సంగతేంటి.? ఈ మూవీ రిజల్ట్ వారిద్దరికీ ఎంత అవసరం? ఒక సినిమా సక్సెస్, ఇంకో సినిమా ఫ్లాప్ అన్నట్టుంది గత కొన్నేళ్లుగా బోయపాటి శ్రీను పరిస్థితి.
సినిమా రిలీజ్‌కి వచ్చేస్తుందంటేనే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కావచ్చిందంటేనే.. అందరి దృష్టి ఆ మూవీకి పనిచేసిన హీరో – డైరక్టర్ల ప్రీవియస్ రికార్డుల మీదకు వెళ్తుంది. ఇప్పుడు స్కంద సినిమాతో బరిలో పోటీకి దిగుతున్న బోయపాటి – రామ్‌పోతినేని సంగతేంటి.? ఈ మూవీ రిజల్ట్ వారిద్దరికీ ఎంత అవసరం? ఒక సినిమా సక్సెస్, ఇంకో సినిమా ఫ్లాప్ అన్నట్టుంది గత కొన్నేళ్లుగా బోయపాటి శ్రీను పరిస్థితి. సరైనోడు సినిమా సక్సెస్ చూశాక, జయ జానకీ నాయకా ఫ్లాప్ తప్పలేదు.
View this post on Instagram
ఆ తర్వాత వినయవిదేయరామ కూడా నిరాశపరచింది. అఖండతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు బోయపాటి. ఇప్పుడు ఆయనకు స్కంద సినిమా సక్సెస్ చాలా కీలకం.
View this post on Instagram
రామ్‌పోతినేనికి కూడా స్కంద సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన నటించిన రెడ్‌గానీ, వారియర్‌గానీ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఎంతో హోప్స్ పెట్టుకుని చేసిన సినిమాలు రెండూ ఫ్లాప్‌లయ్యేసరికి, రెట్టించిన ఉత్సాహంతో హిట్ కోసం పనిచేస్తున్నారు రామ్.
View this post on Instagram
లాస్ట్ రెండు ఫ్లాపులను ఫ్యాన్స్ మర్చిపోయేలా చేస్తాననే పట్టుదల కనిపిస్తోంది మిస్టర్ పోతినేనిలో. ఇస్మార్ట్ సక్సెస్ తర్వాత ఆ రేంజ్‌లో సౌండ్ చేసే సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రామ్ పోతినేని.
View this post on Instagram
మాస్ సినిమాలకు ఎప్పటికప్పుడు కొత్త డెఫినిషన్ ఇచ్చే బోయపాటి డైరక్షన్‌లో చేస్తున్న స్కంద తన కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచి, ఇస్మార్ట్ శంకర్‌ని మరిపిస్తుందన్నది రామ్‌లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్.
View this post on Instagram
ప్యాన్ ఇండియా రేంజ్‌కి మన హీరోలు ఒక్కొక్కరుగా ట్రావెల్ మొదలుపెట్టేశారు. అటు రామ్, ఇటు బోయపాటి ఇద్దరికీ స్కంద ఒకేసారి ప్యాన్ లెవల్లో బ్లాక్‌బస్టర్ రూట్‌ని క్రియేట్ చేస్తుందా.. లెట్స్ వెయిట్ అండ్ సీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి