Bommarillu Bhaskar : మరోసారి అక్కినేని హీరోతో సినిమా చేయనున్న బొమ్మరిల్లు భాస్కర్
బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు భాస్కర్. తొలి సినిమాతో భారీ హిట్ ను అందుకొని బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయాడు.
బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు భాస్కర్( Bommarillu Bhaskar). తొలి సినిమాతో భారీ హిట్ ను అందుకొని బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయాడు. ఆతర్వాత పరుగు, ఆరెంజ్ , ఒంగోలు గిత్త వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక రీసెంట్ గా అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేశారు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు అఖిల్. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఎవరితో సినిమా చేయనున్నారు అన్నది ఆసక్తికరం గా మారింది. అయితే ఇప్పుడు మరోసారి అక్కినేని హీరోతోనే భాస్కర్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది.
తమ్ముడితో డీసెంట్ హిట్ కొట్టిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అన్నతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నాగచైతన్య కోసం ఓ ఫ్యామిలీ కథను సిద్ధం చేస్తున్నారట భాస్కర్. ప్రస్తుతం చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అలాగే రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో చేసే సినిమాను పట్టాలెక్కించి అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..