సీఎం స్టాలిన్, హీరోయిన్ త్రిషా ఇంటికి బాంబు బెదిరింపులు..
సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలకు ఇలా బెదిరింపులు వచ్చాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.

రీసెంట్ డేస్‌లో సెలబ్రెటీల పై దాడులు జరగడం వార్తల్లో వినిపిస్తున్నాయి. టాప్ సెలబ్రెటీలకు బెదిరింపులు రావడం మనం చూస్తున్నాం.. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసంకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. స్టాలిన్ తోపాటు , భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఇంటితో సహా పలు ముఖ్య చోట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు చెన్నైలో భద్రతా పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ బాంబు బెదిరింపులు గురువారం (అక్టోబర్ 2) సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ ఇంటికి వచ్చిన బెదిరింపు కాల్ తో పాటు, రాజ్‌భవన్, బీజేపీ కార్యాలయం, త్రిషా ఇల్లు వంటి చోట్ల కూడా ఇలాంటి కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
చెన్నై పోలీసులు వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు దొరకలేదని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ త్రిషా తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చెన్నైలోని సెనోటాఫ్ రోడ్డు ప్రాంతంలో త్రిష నివసిస్తుంది. ఈ ప్రాంతం సీఎం స్టాలిన్ ఇల్లు ఉన్న చిత్తరంజన్ రోడ్‌కు సమీపంలో ఉంది. ఈ బెదిరింపులు రాజకీయ, సినిమా ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. పోలీసులు ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దించారు.
ఇటీవల తమిళనాడులో బాంబు బెదిరింపులు పెరిగాయి. జులై 27న స్టాలిన్ ఇంటికి వచ్చిన బెదిరింపులు ఆకతాయిలు చేశారని తేలింది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ఇక ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకుంది. నిందితులను పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




