Bollywood : దక్షిణాది మీద దండయాత్ర మొదలు పెట్టిన అందాల ఆర్మీ

వాళ్లూ, వీళ్లూ అందరూ కలిసి అందాల ఆర్మీగా దక్షిణాది మీద దండయాత్ర చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు.? సెట్స్ మీదున్న సినిమాలను జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకుండా నార్త్ ఫ్లేవర్‌ కనిపిస్తుంది.

Bollywood : దక్షిణాది మీద దండయాత్ర మొదలు పెట్టిన అందాల ఆర్మీ
Bollywood
Follow us

|

Updated on: Mar 28, 2023 | 8:19 PM

ఒకరు ముందూ ఒకరు వెనుకా కావచ్చు. ఎలాగైనా, సౌత్‌ని చుట్టుముట్టేయడం మాత్రం ఖాయం అంటోంది నార్త్ బెల్ట్. ఆల్రెడీ సౌత్‌కి ట్రిప్‌ వేసిన వాళ్లు కొందరైతే, ఇక్కడే తిష్ట వేయాలనుకుంటున్నవారు ఇంకొందరు. ఒక్కసారైనా సౌత్‌ మసాలా టేస్ట్ చేయాలనుకునేవారు మరికొందరు. వాళ్లూ, వీళ్లూ అందరూ కలిసి అందాల ఆర్మీగా దక్షిణాది మీద దండయాత్ర చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు.? సెట్స్ మీదున్న సినిమాలను జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకుండా నార్త్ ఫ్లేవర్‌ కనిపిస్తుంది. సౌత్‌లో హీరోయిన్లు లేరా.? నార్త్ కు ఎందుకు వెళ్లారు? అని ఇంతకు ముందులాగా ఎవరూ ప్రశ్నించడం లేదు. సరిహద్దులు చెరిపేసి ముందుకు సాగుతున్న ఈ టైమ్‌లో, అంతా మనవారే, ఎవరు సూట్‌ అయితే వాళ్లను తీస్కోండి అనే ఎంకరేజింగ్‌ మాటలే వినిపిస్తున్నాయి. అందుకే సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అక్కడి వాళ్లను అప్రోచ్‌ అవుతున్నారు మన మేకర్స్.

చోళుల కథతో మణిరత్నం తెరకెక్కించిన సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌. చోళుల గురించి సినిమా తీయాలనుకున్నప్పుడు, అందులోనూ ఆదిత్య కరికాళ చోళుడులాంటి మహరాజు ప్రేమలో విఫలమై విరహంతో బాధపడుతున్నట్టు చూపించాలనుకున్నప్పుడు, అవతల ఉన్న మగువ ఎంత గొప్పదై ఉండాలి. మరెంత అందగత్తై ఉండాలి? ఆత్మవిశ్వాసంలో ఎంతటి తెగువగలదై ఉండాలి? వీటన్నిటికీ టైలర్‌ మేడ్‌ పర్సనాలిటీ అని.. రాయల్‌ లేడీగా ఐశ్వర్యరాయ్‌ని ఎంపిక చేసుకున్నారు మణి. నందిని కేరక్టర్‌కి ఆమెను మించిన వారు లేరని, పీయస్‌1ని చూసిన చాలా మంది ఓపెన్‌గా ప్రశంసించారు. ఇప్పుడు పార్ట్ 2లో ద్విపాత్రాభినయంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు ఐశ్వర్య.

ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మనాలిలోని తన ఇంటికి ఎన్నిసార్లు వెళ్తున్నారో లేదోగానీ, సౌత్‌ ట్రిప్స్ మాత్రం అంతకన్నా రెగ్యులర్‌గానే ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చంద్రముఖి సీక్వెల్‌లో నటిస్తున్నారు కంగనా రనౌత్‌. నార్త్ లో ఒక సినిమా చేస్తే, సౌత్‌లో మరొకటి కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. సౌత్‌ ఇండస్ట్రీ స్టామినాని అర్థం చేసుకుని సపోర్టింగ్‌గా నిలిచిన నార్త్ హీరోయిన్లలో కంగన సీటు ఫస్ట్ బెంచ్‌లోనే.

ప్రాజెక్ట్ కెలో ప్రభాస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, దీపికకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని ఓపెన్‌గా చెప్పేశారు మేకర్స్. నార్త్ లో రీసెంట్‌గా చేసిన పఠాన్‌లోనూ షారుఖ్‌కి ఈక్వెల్‌ రోల్‌ చేశారు దీపిక పదుకోన్‌. ఇప్పుడు ఫైటర్‌లోనూ సిసలైన ఫైటర్‌ ఆమెనే అంటూ పఠాన్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో హింట్‌ ఇచ్చేశారు షారుఖ్‌. ఫర్‌దర్‌గా సౌత్‌ డైరక్టర్‌ అట్లీ చేస్తున్న జవాన్‌లోనూ కీ రోల్‌లో దీపిక కనిపిస్తారనే మాటలున్నాయి. సో నార్త్ అయినా, సౌత్‌ అయినా ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్లు తలుపుతడితే సంతకాలు చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాననే అంటున్నారు దీపిక పదుకోన్‌.

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..