AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh: కల్కి సినిమా పై రణవీర్ సింగ్ ప్రశంసలు.. దీపికా గురించి ఏమన్నాడంటే

ఇప్పటికే ఈ సినిమా 600కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా అను అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ను అభినందిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియావేదికగా సినిమాను అభినందిస్తున్నారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు.

Ranveer Singh: కల్కి సినిమా పై రణవీర్ సింగ్ ప్రశంసలు.. దీపికా గురించి ఏమన్నాడంటే
Kalki 2898 Ad
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2024 | 11:57 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా ప్రభంజనం ఇంకా కంటిన్యూ అవుతుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా భారీ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 600కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా అను అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ను అభినందిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియావేదికగా సినిమాను అభినందిస్తున్నారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలోనే తాజాగా దీపికా పదుకొనె భర్త బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కల్కి సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన భార్య దీపికతో పాటు మొత్తం టీమ్‌ను ప్రశంసించాడు రణవీర్ సింగ్.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కల్కి పోస్టర్‌ను షేర్ చేసిన రణ్‌వీర్ సింగ్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ అలాగే దీపికా పదుకొనేలను విడివిడిగా ప్రశంసించారు. “కల్కి 2898 AD ఒక గొప్ప సినిమా. ఇది నిజమైన బిగ్ స్క్రీన్ సినిమా. భారతీయ సినిమాలో అత్యుత్తమమైనది, నాగి సర్, మొత్తం టీమ్‌కు అభినందనలు అని రాసుకొచ్చాడు. అలాగే రణవీర్ ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరినీ “రెబల్ స్టార్ రాక్” అని “ఉలగనాయగన్ ఈజ్ ది బెస్ట్” అని రాశాడు.

దీనితో పాటు తాను అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానిని అని తెలిపాడు. అశ్వత్థామ పాత్రను పోషించిన అమితాబ్ బచ్చన్ ను ప్రశంసిస్తూ.. రణ్‌వీర్ ఇలా వ్రాశాడు, “మీరు నాలాంటి అమితాబ్ బచ్చన్‌కి గట్టి అభిమాని అయితే, మీరు ఈ సినిమాను మిస్ చేయలేరు. అన్నాడు అదేవిధంగా రణవీర్ దీపికా పదుకొనే నటనను మెచ్చుకున్నాడు ఆమెపై ప్రేమను కురిపించాడు. “నా బేబీ దీపికా పదుకొనే ఎంతో అద్భుతంగా నటించింది. అంత హత్తుకునే నటన, అంత శక్తి, నీకు ఎవరితోనూ పోటీ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” అని రాసుకొచ్చాడు రణవీర్ సింగ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక కల్కి విడుదలై 6 రోజులైంది. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అక్కడ కూడా సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. 160 కోట్లకు పైగా ఓవర్సీస్ బిజినెస్ చేసింది. ఇప్పుడు కల్కి భారీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Kalki 2898 Ad

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే