సుశాంత్ కేసు పక్కదోవ పట్టించేందుకే డ్రగ్స్ తెరపైకి : నగ్మ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తోన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు....

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తోన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు పలువురి నుంచి కీలక విషయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసు విషయంపై సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ స్పందించారు. సుశాంత్ కేసును పక్కదోవ పట్టించేందుకే డ్రగ్స్ కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఎన్సీబీ, ఈడీ, సీబీఐ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో జయప్రద గారికి చెప్పండి. ఈ కేసు విషయంలో వివరాల కోసం అందరం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ కేసును పక్కదోవ పట్టించడానికి అకస్మాత్తుగా బీజేపీ నేతలు డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతున్నారు. దేశమంతా ప్రస్తుతం సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుకుంటుంది.” అని నగ్మ పేర్కొన్నారు. ఇటీవల ఇదే విషయమై మాట్లాడిన సినీ నటి, బీజేపీ మహిళా నేత జయప్రదకు కౌంటర్‌గా ఈ కామెంట్స్ చేసింది నగ్మ.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌కు బానిసగా మారిందంటూ పార్లమెంటులో ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు జయప్రద. అంతేకాదు జయాబచ్చన్ దీనికి వ్యతిరేకంగా మాట్లడటం సరికాదని కౌంటరిచ్చారు. ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారని.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా గళం వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జయప్రద.
Also Read :
ప్రముఖ డిజైనర్ అనుమానాస్పద రీతిలో మృతి




