Karan Johar : సౌత్ సూపర్ స్టార్‌తో కరణ్ జోహార్ సినిమా.. ఎవరో ఊహించండి అంటూ నోట్..
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే అడియన్స్ కు కావాల్సిన సినిమాలను అందించడంలో ముందుంటాడు. ఇప్పటివరకు అతడు తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఇక గతేడాది రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ ప్రేమ కథ భారీ విజయాన్ని అందుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో కరణ్ జోహార్ ఒకరు. అలాగే ప్రొడ్యూసర్ కూడా. మూడు దశాబ్దాల క్రితం తన కెరీర్‌ను ప్రారంభించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికీ కరణ్ జోహర్ సినిమాలకు అభిమానులు ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే అడియన్స్ కు కావాల్సిన సినిమాలను అందించడంలో ముందుంటాడు. ఇప్పటివరకు అతడు తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఇక గతేడాది రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ ప్రేమ కథ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కొత్త ఏడాది మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కరణ్.
కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పోస్ట్‌ను పంచుకున్నారు. తన రాబోయే ప్రాజెక్ట్ గురించిన వివరాలు షేర్ చేశారు. అందులో “ఇది సినిమా ప్రకటన కాదు. కానీ ఇది సహకారంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సినిమా కోసం గత సంవత్సరం నుండి పని చేస్తున్నాము. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి వివరాలను చివరి వరకు రహస్యంగానే ఉన్నాయి. ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్న దర్శకుడి ఉద్దేశం కూడా అదే కావడంతో చిత్రబృందానికి కూడా ఈ విషయం తెలియలేదు. ” అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో నటీనటులను అంచనా వేయాలని అభిమానులను కోరాడు.
A) వారిలో ఒకరు సౌత్ సూపర్ స్టార్. ఇటీవల పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమాలో నటించారు.
B) తన టాలెంట్, మోషనల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్న అభిమాన హీరోయిన్.
C) తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ.. అరంగేట్రం చేస్తున్న నటుడు అతని ప్రతిభ అసాధారణమైనది. తన వృత్తి కోసం చాలా కష్టపడుతున్నాడు. అంటూ రాసుకొచ్చాడు కరణ్. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరలవుతుండడంతో.. సౌత్ సూపర్ హీరో ఎవరంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే కరణ్ జోహార్ తదుపరి ప్రాజెక్టులో పృథ్వీరాజ్ సుకుమార్, కాజోల్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ అని టాక్ నడుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




