Sunny Leone: సన్నీ లియోన్‌కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్.. అసలు ఏం జరిగిందంటే

తాజాగా సన్నీ లియోన్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో సన్నీ ఓ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉంది, ఆ ఈవెంట్ కు అంతా సిద్ధం అయ్యింది. దీనికి పెద్ద సంఖ్యలో ఆడియన్స్ కూడా గుమిగూడారు.

Sunny Leone: సన్నీ లియోన్‌కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్.. అసలు ఏం జరిగిందంటే
Sunny Leone
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 03, 2024 | 9:11 AM

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా సన్నీ లియోన్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో సన్నీ ఓ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉంది, ఆ ఈవెంట్ కు అంతా సిద్ధం అయ్యింది. దీనికి పెద్ద సంఖ్యలో ఆడియన్స్ కూడా గుమిగూడారు. అయితే చివరి క్షణంలో షో రద్దయిందని, అందుకు కారణం సన్నీలియోన్ ఆరోగ్యమేనని నిర్వాహకులు తెలిపారు. సన్నీ అనారోగ్యానికి గురవ్వడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ అని నిర్వాహకులు తెలిపారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ప్రోగ్రాం కోసం వచ్చిన ఫ్యాన్స్, ఆడియన్స్ నిరాశపడ్డారు. కానీ అసలు విషయం ఆతర్వాత బయటకు వచ్చింది. ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడానికి కారణం అది కాదు అని తెలిసింది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో బాలీవుడ్ సన్నీలియోన్ డీజే నైట్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాలా మంది తమ అభిమాన ఈ ప్రోగ్రాం చూసేందుకు బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కూడా కొనుగోలు చేశారు. డీజే నైట్ సమయం రాత్రి 11 నుండి 12.30 వరకు ఉంది, దీనికి భారీగా జనాలు హాజరయ్యారు. అయితే ఈ షో జరగకుండా 8 గంటల నుంచే పబ్ బయట 100 మందికి పైగా పోలీసులను మోహరించారు.

పోలీసుల మోహరింపును చూసిన అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు, దీన్ని నిర్వహించడానికి అరగనైజర్స్  పబ్ స్క్రీన్‌పై వీడియో ద్వారా చెప్పారు. ఆ వీడియోలో సన్నీ లియోన్ అనారోగ్యం కారణంగా, ఆమె ప్రదర్శన చేయలేకపోవచ్చని, అయితే క్లబ్ దాని బాలీవుడ్ థీమ్ యొక్క ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని చెప్పారు. చివరికి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఈ మెసేజ్ చూసిన చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ పోలీసుల అనుమతి లేకపోవడంతోనే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని తర్వాత తెలిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.