AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: స్త్రీల కంటే పురుషులే సురక్షితంగా ఉన్నారు.. కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కొద్ది రోజుల క్రితం నటి నీనా గుప్తా స్త్రీవాదంపై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'పురుషులు, స్త్రీలు ఎప్పటికీ సమానంగా ఉండలేరు.. పురుషుడు కూడా గర్భం దాల్చితే అప్పుడు స్త్రీ, పురుషులు సమానమే..' అని నీనా గుప్తా అన్నారు. ఆమె ప్రకటనపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. చాలా మంది నీనా గుప్తాను ట్రోల్ చేశారు.

Kangana Ranaut: స్త్రీల కంటే పురుషులే సురక్షితంగా ఉన్నారు.. కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kangana Ranaut
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2023 | 7:44 PM

Share

నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా నటి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీని కారణంగా మరోసారి కంగనా వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం నటి నీనా గుప్తా స్త్రీవాదంపై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘పురుషులు, స్త్రీలు ఎప్పటికీ సమానంగా ఉండలేరు.. పురుషుడు కూడా గర్భం దాల్చితే అప్పుడు స్త్రీ, పురుషులు సమానమే..’ అని నీనా గుప్తా అన్నారు. ఆమె ప్రకటనపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. చాలా మంది నీనా గుప్తాను ట్రోల్ చేశారు. తాజాగా నటి కంగనా మాత్రం నీనా గుప్తా కామెంట్స్ పై స్పందించింది.  పురుషులు,మహిళల గురించి ఓ పోస్ట్ ను షేర్ చేసింది. నీనా గుప్తా ప్రకటనపై అందరూ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే.. ఇటీవల నీనా మాట్లాడుతూ.. స్త్రీ పురుషులు ఎప్పటికీ సమానం కాలేరు. స్త్రీ వేరు.. పురుషులు వేరు కాదా? పురుషులు, మహిళలు మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. కాబట్టి దేవుడే కాదు, గురువు, పెద్దలు, తల్లి – తండ్రి, అందరూ బిన్నంగా ఉంటారు.

‘కొందరికి ఎక్కువ అనుభవం ఉంది, మరికొందరు ఎక్కువ అభివృద్ధి చెందారు. కానీ మనం ఏ స్థాయిలోనూ సమానం కాదు అని అంది. అలాగే ఆడవాళ్లకు మగవాళ్ళు కావాలా.? ఖచ్చితంగా.. మహిళలకు పురుషులు ఎంత అవసరమో.., పురుషులకు కూడా మహిళలు అవసరం. మా అమ్మ తన జీవితాన్ని ఒంటరిగా గడపవలసి వస్తే, ఆమె జీవితంలో చాలా కష్టాలు ఉండేవి..’ అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.

దీని పై కంగనా స్పందిస్తూ.. ‘మా అమ్మ లేకుండా నాన్న కూడా ఉండలేరు. ఇందులో అవమానం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పురుషులకు నెలలో ఏడు రోజులు రక్తస్రావం జరగదు.. వారికి దైవిక శక్తి లేదు.. ఈరోజు స్త్రీల కంటే పురుషులే సురక్షితంగా ఉన్నారు. ముఖ్యంగా యువతులకు ఇది అంత ఈజీ కాదు..’ అని కంగనా రనౌత్ కూడా చెప్పింది. ప్రస్తుతం కంగనా రనౌత్ పోస్ట్ మాత్రమే సర్వత్రా చర్చనీయాంశమైంది.

Kangna

kangana ranaut

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్