AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన త్రిష.. ఈసారి ఇలా

నాలుగు పదుల వయసులోనూ తనదైన అందంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల త్రిష, విజయ్‌తళపతి లియో సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అదే సినిమాలో మరో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా మన్సూర్‌ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Trisha Krishnan: మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన త్రిష.. ఈసారి ఇలా
Mansoor Ali Khan, Trisha
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2023 | 8:12 PM

Share

సౌత్‌ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రిష గత 20ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. నాలుగు పదుల వయసులోనూ తనదైన అందంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల త్రిష, విజయ్‌తళపతి లియో సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అదే సినిమాలో మరో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా మన్సూర్‌ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది కూడా. దీనిపై త్రిషతో పాటు పలువురు నటులు స్పందించారు. మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్‌ విచారణ అనంతరం మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. థౌజండ్‌ లైట్‌ ఆల్‌ ఉమెన్‌ పోలీసులు కేసు మన్సూర్‌పై కేసు నమోదు చేశారు. సమన్లు పంపడంతో ఆయన పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తునకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై..త్రిష తరఫున రాతపూర్వక వివరణ కోరుతూ పోలీసులు లేఖ పంపారు. మన్సూర్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, అతడిపై ఎలాంటి కేసులు పెట్టొద్దని త్రిష పోలీసులకు లిఖిత పూర్వకంగా కోరినట్లు పోలీసులు తెలిపారు.

త్రిష పై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. త్రిషతో రేప్ సన్నివేశాలు ఉంటాయనుకున్నా.. కానీ అలా జరగలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పై సినీ ఇండస్ట్రీ పెద్దలు రియాక్ట్ అయ్యారు. మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ ను ఖండించారు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

త్రిష కృష్ణన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి