Akhanda 2: బాలయ్య అఖండ 2లో బాలీవుడ్ నటి.. జనని పాత్రలో నటించనుంది ఈమె
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో అఖండ 2 సినిమా ఒకటి. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య.. ఇటీవలే అఖండ 2 నుంచి ఓ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ వీడియో సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందులో మరోసారి బాలయ్య నట విశ్వరూపం చూపించేశారు.
ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మొదటి రోజునే జాయిన్ కావడంతో అఖండ 2 జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదిరిపోయింది. దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25, 2025న సినిమా విడుదలవుతుందని వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. అఖండ 2 సినిమాలో జనని పాత్రలో నటించే నటి గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఆ పాత్రలో బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్ర నటించనుంది. గతంలో ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలో మున్నీగా నటించింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. సల్మాన్ సినిమా కంటే ముందు హిందీలో తెరకెక్కిన పలు సీరియల్స్‌లో నటించింది హర్షాలీ మల్హోత్ర. ఇప్పుడు అఖండ 2లో జనని పాత్రలో నటిస్తుందని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
View this post on Instagram
అఖండ 2 సినిమాలో జనని..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








