
ముంబైలో గణేశ్ నవరాత్రులు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కొందరు తమ ఇళ్లల్లోనే గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటే మరికొందరు సమీపంలోని వినాయక మండపాలకు వెళ్లి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. అలా తాజాగా ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని జీఎస్ బీ సేవా మండల్ గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైట్ డ్రెస్ లో ఐశ్వర్య ఎంతో అందంగా కనిపించింది. అలాగే ఆరాధ్య కూడా కుర్తాలో చాలా క్యూట్ గా ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ముంబైలో జీఎస్ బీ సేవాదళ్ నిర్వహించే గణపతి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సెలబ్రిటీలు కూడా ఇక్కడకు వచ్చి గణేశుడి ఆశీస్సులు పొందుతుంటారు. ఇక ఐశ్వర్య కూడా ఏటా జీఎస్ బీ గణేశ్ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య చివరిగా పొన్నియిన్ సెల్వన్ IIలో కనిపించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామాలో ఐశ్వర్య రెండు పాత్రల్లోనూ అదరగొట్టింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో ఐష్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని అభిమానులు ఊహించారు. అయితే దీని తర్వాత ఐష్ నుంచి ఎలాంటి కొత్త సినిమాలు రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఈ అందాల తారను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా గత కొన్ని రోజులుగా అభిషేక్, ఐశ్వర్యల విడాకుల గురించి పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ వీరు మాత్రం కలిసే కనిపిస్తున్నారు. ఆరాధ్య స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఐష్, అభిషేక్ ఒకేచోట కనిపించారు. ఇటీవల ఐశ్వర్య అభిషేక్ 49వ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. దీంతో వీరి విడాకుల వార్తలు రూమర్లే అని తేలిపోయాయి.
#AishwaryaRaiBachchan and #AaradhyaBachchan at GSB today ❤️ pic.twitter.com/QuccUBgyGM
— Aishwarya Rai – FC (@FabulousAish) September 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.